Friday, September 12, 2025 01:08 PM
Friday, September 12, 2025 01:08 PM
roots

బెంగళూరు టూ పులివెందుల.. తాడేపల్లి లేనట్టే..!

ఏపీ మాజీ సిఎం వైఎస్ జగన్.. బెంగళూరు నుంచి రాష్ట్రానికి వచ్చారు. అధికారం కోల్పోయిన తర్వాత పదే పదే బెంగళూరు వెళ్తున్న జగన్.. అక్కడే ఉంటూ నాయకులతో ఫోన్ లో మాట్లాడుతున్నారు. ఎప్పుడు వస్తున్నారో కూడా క్లారిటీ లేని పరిస్థితి. ప్రజలకు కూడా జగన్ పెద్దగా అందుబాటులో ఉండటం లేదనే విమర్శ ఉంది. పార్టీ అగ్ర నాయకులు మినహా మిగిలిన వారికి జగన్ దూరంగా ఉంటున్నారు. అటు తన సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా జగన్ అందుబాటులో ఉండటం లేదు.

Also Read : విశ్వంభరా కాపాడుతుందా..? మెగా ఫ్యాన్స్‌కు గడ్డు కాలం

నేడు పులివెందుల పర్యటన కోసం చాన్నాళ్ళ తర్వాత జగన్ వెళ్లారు. నేటి నుంచి మూడు రోజుల పాటు పులివెందులలో జగన్ పర్యటన ఉంటుంది. తన తండ్రి వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నేడు పులివెందులకు వచ్చినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక మధ్యాహ్నం నుంచి కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు జగన్ అందుబాటులో ఉంటారు. రేపు ఉదయం ఇడుపులపాయ వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించనున్న వైఎస్‌ జగన్‌.. ఆ తర్వాత పలు కార్యక్రమాల్లో పాల్గొంటారట.

Also Read : మోక్షజ్ఞ ఎంట్రీ ఆ డైరెక్టర్ తోనే..? క్లారిటీ వచ్చేసిందా..?

అనంతరం లింగాల మండలం అంబకపల్లి చెరువు వద్ద జలహారతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా రూ.2.5 కోట్లతో అంబకపల్లిలో కొత్తగా చెరువు నిర్మాణం జరిగింది. మరో రూ.2.5 కోట్లతో ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి నిధులతో ఎత్తిపోతల పథకం, పైప్‌లైన్‌ నిర్మాణం జరిగాయి. తాజాగా చెరువు అందుబాటులోకి వచ్చింది. లింగాల కుడి కాల్వ నుంచి అంబకపల్లిలోని గంగమ్మకుంట చెరువుకు నీరు వస్తున్నాయి. ఈ చెరువు వద్ద జగన్ జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు.రేపు మధ్యాహ్నం నుంచి కార్యకర్తలకు అందుబాటులో ఉండి అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళిపోతారు. తాడేపల్లి నివాసానికి జగన్ వచ్చే వారం వస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

నేపాల్ పరిస్థితి.. పవన్...

నాలుగైదు రోజులుగా నేపాల్ లో మారుతున్న...

కొణిదెల వారసుడు వచ్చేశాడు..!

కొణిదెల కుటుంబంలోకి కొత్త వారసుడొచ్చాడు. వరుణ్...

పోల్స్