Tuesday, October 28, 2025 02:23 AM
Tuesday, October 28, 2025 02:23 AM
roots

అసెంబ్లీకి జగన్.. అనర్హత భయంతోనేనా?

వైసీపీ అధినేత వైయస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నుంచి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు జగన్ స్వయంగా ఫోన్లు చేసారు. అలాగే సభకు వచ్చే ముందు బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వంపై పోరాటం చేయడానికి పలు విషయాలపై అవగాహన పెంచుకొని రావాలని అలాగే గత ప్రభుత్వంలో తాము చేసిన మంచిని ప్రజలకు అసెంబ్లీ సమావేశాల్లో అలాగే మీడియా సమావేశాల్లో చెప్పేందుకు ప్రయత్నం చేయాలని పార్టీ నేతలకు సూచించారు.

Also Read : వైసీపీకి మరో షాక్.. పల్నాడు జిల్లా షేకింగ్ న్యూస్

ఎమ్మెల్యేలు కాని మాజీ మంత్రులు మీడియా సమావేశాలలో అందుబాటులో ఉండాలని జగన్ ఆదేశించారు. ఇప్పటివరకు ప్రభుత్వం మారిన తర్వాత జగన్ సమావేశాలకు హాజరు కాలేదు. ప్రతిపక్ష హోదా ఇస్తే గాని సభకు రానంటూ గతంలో జగన్ ప్రకటించారు. 10% సీట్లు కూడా లేకపోవడంతో ప్రతిపక్ష హోదా వైసిపి కోల్పోయింది. వరుసగా 60 రోజులు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే శాసనసభ సభ్యత్వం కోల్పోయే ప్రమాదం ఉండవచ్చని, సభకు హాజరై ఆ ముప్పు నుంచి తప్పించుకోవాలని జగన్ భావిస్తున్నారు.

Also Read : సోషల్ మీడియా పోస్టులకు ఘాటు కౌంటర్లు..!

జగన్ తో పాటుగా మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని.. 60 రోజులు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే పులివెందులకు ఉప ఎన్నిక రావడం ఖాయమని హెచ్చరించారు. ఈ పరిస్థితులు నేపథ్యంలో జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయం తీసుకోవడం సంచలనం అవుతుంది. అయితే జగన్ అసెంబ్లీ సమావేశాలకు కంటిన్యూగా వస్తారా లేదా అనేదానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఇక జగన్ సమావేశాలకు హాజరు కావడంతో అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్