Sunday, October 26, 2025 06:00 AM
Sunday, October 26, 2025 06:00 AM
roots

జగన్ మరో ప్లాన్.. వర్కవుట్ అవుతుందా..?

ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలంటే.. నిత్యం ప్రజల మధ్య ఉండాలి.. లేదా ప్రజా సమస్యలు పరిష్కరించాలి.. లేదంటే ఆ వ్యక్తి గురించి ప్రజలు విస్తృతంగా చర్చించుకోవాలి. ఎన్నికల్లో ఓడిన తర్వాత జగన్ తన మకాం పూర్తిగా బెంగళూరు యలహంక ప్యాలెస్‌కు మార్చేశారు. ప్రజల మధ్య కాదు కదా.. పార్టీ నేతలకే అందుబాటులో లేకుండా పోయారు. ఇక ప్రజా సమస్యల గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. ఏడాది కాలంలో రెండు సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. ప్రమాణ స్వీకారానికి ఒకసారి.. బడ్జెట్ సందర్భంగా గవర్నర్ ప్రసంగం మొదటి రోజున.. అంతే తప్ప చట్టసభలో ప్రజా సమస్యపై చర్చించిన పాపానా పోలేదు.

Also Read : అప్పుడు ప్రజాస్వామ్యం లేదా చిన్న సారూ..?

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను కూటమి సర్కార్ అమలు చేస్తోంది. అమరావతి, పోలవరం ప్రాజక్టు పనులు జరుగుతున్నాయి. కుప్పం నియోజకవర్గానికి కృష్ణా నది నీళ్లు ఇస్తానన్న మాటను చంద్రబాబు నిలబెట్టుకున్నారు. తల్లికి వందనంపై సర్వాత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఇక స్త్రీ శక్తి పధకం కూడా అమల్లోకి రావడంతో.. వైసీపీని ప్రజలు మర్చిపోతున్నారనే మాట వినిపిస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో జగన్ గురించి జనం చర్చించాలంటే.. ఏం చేయాలి అనే ప్రశ్నకు ఒకటే సమాధానం. అదే కాంట్రవర్సీ. ఏదైనా సరే ఒక వివాదాస్పద వ్యాఖ్య, పర్యటన చేస్తేనే ఓ వారం రోజుల పాటు జగన్ గురించి జనం చర్చించుకుంటారనేది వైసీపీ నేతల స్ట్రాటర్జీ. అందుకే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఓ వివాదాస్పద వ్యాఖ్య చేసి వెళ్లిపోతారు జగన్. అలాగే ఏదైనా పరామర్శ పేరుతో హంగామా చేస్తారు. దీనికి అనుమతి ఇవ్వలేదని.. జనాల్ని అడ్డుకుంటున్నారని.. జన సంద్రమని గొప్పగా ప్రచారం చేసుకుంటారు. అయితే నెల్లూరు జిల్లా పర్యటనలో వైసీపీ అధికార టీవీ సాక్షి ఛానల్‌లో పాత వీడియో టెలికాస్ట్ కావడంతో.. వచ్చిన జనం కూడా ఫేక్ అనే మాట బాగా వైరల్ అయ్యింది. దీంతో అప్పటి నుంచి పరామర్శల పర్యటనకు బ్రేక్ వేశారు జగన్.

Also Read : బిజెపికి కోమటిరెడ్డి ఆఫర్.. అలెర్ట్ అయిన కాంగ్రెస్..?

తాజాగా మరో కీలక పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 28న తిరుమల వెళ్లనున్నట్లు వైసీపీ నేతలు వెల్లడించారు. దసరా నుంచి జిల్లాల్లో పర్యటిస్తారని కూడా వెల్లడించారు. అయితే ఇక్కడే కొత్త వివాదానికి వైసీపీ నేతలు తెర లేపినట్లైంది. వాస్తవానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హిందుత్వం మీద నమ్మకం లేదు. వైఎస్ రాజారెడ్డి హయాం నుంచే వారు క్రిస్టియానిటీని నమ్ముకున్నారు. అందుకే సీఎంగా తిరుమల పర్యటనకు కూడా జగన్ ఒక్కరే వచ్చారు తప్ప.. సతీసమేతంగా రాలేదు. సంక్రాంతి ఉత్సవాలను కూడా గుడిలో కాకుండా.. గుడి సెట్ వేసి నిర్వహించారు. జగన్, భారతీ సహా కుటుంబ సభ్యులు ప్రసాదం తీసుకుంటున్న వీడియో, ఫోటోలు ఎక్కడా లేవు కూడా.

సాధారణంగా అన్యమతస్తులు తిరుమలకు వచ్చినప్పుడు శ్రీవారి మీద నమ్మకం ఉందనే డిక్లరేషన్ మీద సంతకం చేయాల్సి ఉంది. అబ్దుల్ కలాం మొదలు.. ఎంతో మంది ప్రముఖులు ఇలా డిక్లరేషన్ ఇచ్చిన వాళ్లే. ఇదే విషయాన్ని గతేడాది కూడా టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. గతేడాది జులై నెలలో జగన్ తిరుమల వెళ్లనున్నట్లు ప్రకటించారు. అయితే టీడీపీ నేతలు మాత్రం డిక్లరేషన్ ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరుమల వెళ్లలేదు. మళ్లీ ఏడాది తర్వాత అదే వివాదానికి వైసీపీ నేతలు తెరలేపినట్లు అయ్యింది. డిక్లరేషన్ ఇస్తేనే స్వామి వారి దర్శనం అనే మాట టీడీపీ నేతలు ప్రస్తావిస్తే.. దానిపై ఓ వారం రోజుల పాటు రచ్చ జరగటం ఖాయం. అప్పుడు వైసీపీకి, జగన్‌కు కావాల్సినంత పబ్లిసిటీ అనేది వైసీపీ నేతల ప్లాన్. మరి ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా.. లేదా అనేది చూడాల్సి ఉంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

సస్పెండ్ చేస్తే తిరువూరు...

తిరువూరు నియోజకవర్గం టీడీపీలో అలజడి కొనసాగుతోంది....

పులివెందులకు కేంద్రం గుడ్...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

వరల్డ్ కప్‌కు మేం...

గత నాలుగు నెలల నుంచి భారత...

రోహిత్ రికార్డుల మోత.....

భారత క్రికెట్ అభిమానులకు టీమిండియా ఓపెనర్...

ఒక్కొక్కరికి కోటి ఇచ్చే...

బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాతి...

హైడ్రా కమీషనర్ రంగనాథ్...

హైదరాబాద్‌లోని హైడ్రా కమీషనర్ రంగనాథ్ శుక్రవారం...

పోల్స్