Friday, September 12, 2025 03:19 PM
Friday, September 12, 2025 03:19 PM
roots

వాళ్లంతా వేస్ట్… ఆ జిల్లా నేతలపై జగన్ ఫైర్..!

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఉంది వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క నేతను, కార్యకర్తను పట్టించుకోని జగన్.. ఒక నియంత పాలన సాగించారు. సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కాబట్టి… ప్రజలు మళ్లీ ఓట్లేస్తారని ఓవర్ కాన్ఫిడెన్స్ తో వ్యవహరించిన జగన్ కు ఓటర్లు ఊహించని షాక్ ఇచ్చారు. కోలుకోలేని దెబ్బ తిన్న జగన్.. చివరికి మొహం కూడా చూపించలేక మకాం తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరు ప్యాలెస్ కు మార్చారు. అయితే నేతలు పెద్ద ఎత్తున పార్టీకి దూరమవుతుండటంతో ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అందుకే ఐదేళ్లు గేటు బయటే ఆగిపోయిన కార్యకర్తను స్వయంగా కలుస్తా అంటూ హామీ ఇస్తున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత నుంచి కార్యకర్తలతో జగనన్న అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.

Also Read : పోలీసుల ముందు బోరుగడ్డ సంచలన విషయాలు 

ప్రతి పార్లమెంటు పరిధిలో రెండు రోజులు బస చేయటంతో పాటు నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో స్వయంగా మాట్లాడుతామన్నారు. కార్యకర్తలతో జగనన్న కార్యక్రమానికి ముందుగా జిల్లాల ముఖ్య నేతల తీరుపై జగన్ వివరాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా నేతల తీరుపై జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన ఒకరిద్దరు నేతలు మినహా మిగిలిన అందరినీ వేస్ట్ ఫెలోస్ అనేసినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి మధ్య వ్యవహారం పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చిందన్నారట. అలాగే సిక్కోలు జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ధర్మాన సోదరులిద్దరూ ఏమయ్యారని ఆరా తీసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ధర్మాన ప్రసాదరావు పార్టీ మారుతున్నారే విషయం చర్చించినట్లు సమాచారం.

Also Read : తన సస్పెన్షన్ వార్తల పై జానీ మాస్టర్ క్లారిటీ

ఇక మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గురించి ఆరా తీసిన జగన్… ఆమదాలవలస నియోజకవర్గం ఇంఛార్జ్ ను మార్చిన తర్వాత తమ్మినేని తీరుపై నిఘా ఉంచాలని సూచించినట్లు తెలుస్తోంది. జిల్లా మహిళా నేతలు రెడ్డి శాంతి, విశ్వసరాయి కళావతి ఎక్కడా అని విచారించగా.. రెడ్డి శాంతి ఢిల్లీ వెళ్లిపోయారని… కళావతి కూడా విశాఖలోనే ఉంటున్నారు తప్ప.. పాలకొండ వైపు కన్నెత్తి కూడా చూడలేదని తెలియటంతో… వారిని తప్పించి కొత్త వాళ్లకు అవకాశం ఇద్దామని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎచ్చెర్ల, రాజాం, ఇచ్ఛాపురం నియోజకవర్గాల నేతలు బతికే ఉన్నారా అని ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్… రీజనల్ కో ఆర్డినేటర్లు ఏం చేస్తున్నారని నిలదీసినట్లు తెలిసింది. మొత్తానికి ఫలితాలు వచ్చిన ఆరు నెలల తర్వాత నిద్ర లేచిన జగన్… సీనియర్ నేతలను వేస్ట్ ఫెలోస్ అనటం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్