Tuesday, October 21, 2025 02:46 PM
Tuesday, October 21, 2025 02:46 PM
roots

రాజీనామాలు చేసేద్దాం..? జగన్ సంచలన నిర్ణయం..?

ఆంధ్రప్రదేశ్ లో కీలక రాజకీయ పరిణామాలకు రంగం సిద్ధమవుతున్న సంకేతాలు కనబడుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్న వైసీపీ ఇప్పుడు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అనే కారణంతో ప్రజల్లోకి వెళ్లేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. 2024 ఎన్నికల్లో 11 మంది ఎమ్మెల్యేలు వైసీపీకి గెలవగా ఇప్పుడు అందరూ మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Also Read : చంద్రబాబు ముందుకు అసెంబ్లీ అటెండెన్స్..? ఎమ్మెల్యేలపై చర్యలు..?

ప్రజల్లోకి వెళ్ళేందుకు ఇప్పటినుంచి సిద్ధమవుతున్న జగన్.. రాజీనామాల ద్వారా ఉప ఎన్నికలు వస్తే, ప్రభుత్వాన్ని ప్రజల్లో ఎండగట్టడానికి అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు జగన్ నేరుగా ప్రజల్లోకి వెళ్లి ఎటువంటి నిరసన కార్యక్రమాలు గానీ పోరాటాలు గానీ చేయలేదు. అటు వైసిపి నాయకత్వం కూడా పెద్దగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయడం లేదు. ఈ సమయంలో అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరు అయ్యేందుకు ఇష్టపడటం లేదు. తనను ఇబ్బంది పెడతారు అనే కారణంతో సభకు జగన్ దూరంగా ఉంటున్నారు.

Also Read : చాగంటిపై లోకేష్ ప్రసంశలు.. ఆశ్చర్యంగా ఉందంటూ కామెంట్..!

ఇక ఇప్పుడు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజల్లోకి వెళితే.. తమకు వచ్చే మెజారిటీలు ఆధారంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయవచ్చని, అలాగే దమ్ముంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని జగన్ సవాల్ చేసేందుకు అవకాశం దొరుకుతుందని భావిస్తున్నట్లుగా ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. అటు ఎంపీలతో కూడా రాజీనామా చేయించాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఎంపీలు కూడా పెద్దగా పార్లమెంట్ సమావేశాలపై దృష్టి పెట్టడం లేదు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో జగన్ నిర్ణయం తీసుకుని ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించవచ్చు అని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు రాజీనామా చేస్తే బీహార్ ఎన్నికలతో పాటుగా ఉప ఎన్నికలను కూడా నిర్వహిస్తారనే భావనలో జగన్ ఉన్నట్లు సమాచారం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

చంద్రబాబు ధైర్యానికి ఫిదా.....

సాధారణంగా ఈ రోజుల్లో రాజకీయ నాయకులు...

భారతీయ విద్యార్ధులకు ట్రంప్...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే...

కొండా వివాదం సద్ధుమణిగినట్లేనా..?

తెలంగాణలో మంత్రుల మధ్య వివాదం కాంగ్రెస్...

కందుకూరులో వైసీపీ ప్లాన్...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సామాజిక వర్గాల మధ్య...

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

పోల్స్