Friday, September 12, 2025 05:11 PM
Friday, September 12, 2025 05:11 PM
roots

అన్న వింటున్నాడు గురూ.. జాగ్రత్తగా ఉండండి.. వైసీపీ నేతల్లో కొత్త భయం

టీడీపీని వైసీపీ అధినేత జగన్ అప్పట్లో గిల్లితే వైసీపీ నేతలు ఎంజాయ్ చేసారు గాని ఇప్పుడు వైసీపీ నేతలనే అన్న గిల్లుతుంటే వైసీపీ నేతలు బయటకు అరవలేక, నొప్పిని భరించలేక సతమవుతున్నారు. ముఖ్యంగా ప్రజా ప్రతినిధుల విషయంలో చెమటలు పట్టే వాతావరణం ఉంది. ధైర్యం ఇస్తాడు అనుకుంటే అన్న నిఘా పెట్టాడని భయపడుతున్నారు కొందరు నేతలు. సాధారణంగా జగన్ ఆలోచనలు రాజకీయ నాయకులకు అర్ధం కావు. ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికి క్లారిటీ ఉండదు. ఇప్పుడు అదే విషయం వైసీపీ నేతలను కలవరపెడుతున్న అంశం.

మేటర్ అర్ధం కాలేదు కదా…? మాములుగా ఉన్నదీ 11 మంది ఎమ్మెల్యేలు. నలుగురు ఎంపీలు… కొందరు ఎమ్మెల్సీలు, మరికొందరు రాజ్యసభ ఎంపీలు. వీళ్ళల్లో ఎమ్మెల్యేలు, లోక్ సభ ఎంపీలు మినహా మిగిలిన వాళ్ళు జారిపోతున్నారు. ముగ్గురు ఎమ్మెల్సీలు రాంరాం చెప్పేశారు అన్నకు. రాజ్యసభలో మూడు వికెట్ లు పడ్డాయి. అందుకనే… ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేల విషయంలో జగన్ కు భయం పట్టుకుంది. మీడియా ముందుకు రావట్లేదు, అసలు ఎక్కడ ఉన్నారో తెలియదు, ఒక్క ఎమ్మెల్యే కూడా మీడియా సమావేశం పెట్టలేదు ఇప్పటి వరకు.

Also Read : ఆంధ్రప్రదేశ్ కు భారీ ముప్పు…?

పులివెందుల ఎమ్మెల్యేనే ప్రజల్లో కనపడుతున్నారు. ఎమ్మెల్సీలలో అప్పుడు చెలరేగిపోయిన వాళ్ళు కూడా సైలెంట్ గా ఉన్నారు. ఎంపీల్లో అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి మాత్రమే రియాక్ట్ అవుతున్నారు. మిగిలిన వాళ్ళ జాడ లేదు. అందుకే అసలు వీళ్ళు ఉంటారో ఊడతారో తెలియక జగన్ లో ఆందోళన మొదలైంది. వాళ్ళను టీడీపీ కచ్చితంగా తీసుకోదు. తీసుకుంటే బిజెపినే తీసుకుంటుంది. అదే జరిగితే ప్రేక్షక పాత్ర మినహా జగన్ చేసేది ఏం ఉండదు. అందుకే ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీల మీద నిఘా పెడుతున్నారట.

చెప్పి వెళ్ళాలి.. చెప్పులు వేసుకుని వెళ్ళాలి అనే షరతులు కనపడకుండా పెట్టారట. మీడియాలో వాళ్ళ హాజరు లేకపోయినా జగన్ కు మాత్రం ఉందట. తాడేపల్లి ఆఫీస్ కు అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారట. తమ పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడే సమయంలో గాని, ఎక్కడికి అయినా బయటకు వెళ్ళే సమయంలో గాని జాగ్రత్తలు పడుతున్నారట. ఎవరైనా ఏదైనా మాట్లాడాలి అంటే… అమ్మో అన్న వింటున్నాడు అనే భయం ఉందట వారిలో. 11 ప్లస్ 4=15 ఈ 15 మందిలో 4 వికెట్లు చాలా ముఖ్యం. ఆ నాలుగులో ఒకరి మీద మాత్రమే అన్నకు గుడ్డి నమ్మకం. మరో ఎంపీ గారు… వై కేటగిరి భద్రత కూడా తెచ్చుకున్నారు కేంద్రం నుంచి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్