Tuesday, October 28, 2025 04:53 AM
Tuesday, October 28, 2025 04:53 AM
roots

ప్లీజన్నా రండి.. పార్టీ నేతలకు జగన్ రిక్వెస్ట్

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నానా కష్టాలు పడుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా గతంలో అన్నకు అండగా నిలిచి మేమున్నాం అంటూ తోడు నిలిచిన నాయకులు ఇప్పుడు అసలు వైసీపీ కేంద్ర కార్యాలయం వైపు చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. ముందు పార్టీని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం జగన్ కు పెద్ద సమస్య అయిపోయింది. కీలక నాయకత్వం మౌనంగా ఉండటంతో జగన్ లో ఆందోళన వేరే లెవెల్ లో ఉంది. అప్పుడప్పుడు బెంగళూరు వెళ్లి, పార్టీ కార్యాలయంలో అప్పుడో జిల్లాలో అప్పుడో జిల్లా మీటింగ్ లు పెడుతుంటే వర్కౌట్ కావడం లేదని జగన్ భావిస్తున్నారు.

Also Read : ఇదెక్కడి ట్విస్ట్, బుకింగ్ యాప్స్ లో పుష్పకు షాక్ ఇస్తున్న అమరన్

అందుకే అందరూ రేపు అందరూ తాడేపల్లి రావాలని జగన్ ఆదేశాలు ఇచ్చారు. కాదు కాదు రిక్వస్ట్ చేస్తున్నారు. తన ఇగోని పక్కన పెట్టి వైసీపీ నాయకులకు ఫోన్ లు చేసారు జగన్. రేపు పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం కీలకంగా మారింది. సైలెంట్ గా ఉన్న నేతలు అందరూ తాడేపల్లి వచ్చేయండి కలిసి భోజనం చేద్దాం అని కూడా పిలిచారు జగన్. పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లు, జనరల్‌ సెక్రటరీలు, పార్టీ సెక్రటరీలు అందరూ హాజరు కానున్నారు. పార్టీ బలోపేతం, నిర్మాణంపై దృష్టి పెట్టి… వారి అభిప్రాయాలను తీసుకుంటారు జగన్.

Also Read : అదానితో ఒప్పందం రద్దు అయితే, పెనాలిటీ ఎన్ని వేల కోట్లంటే…!

పార్టీ పరంగా కమిటీల ఏర్పాటు, వాటి భర్తీపై చర్చ జరగనుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు కలుగుతున్న అనేక ఇబ్బందులపైనా చర్చిస్తారు. భారీగా కరెంటు ఛార్జీలు పెంచి ప్రజల నడ్డివిరుస్తున్న చంద్రబాబు సర్కార్‌ పై యుద్ధం చేయాలని జగన్ నాయకులకు పిలుపునివ్వనున్నారు. దీనిపైనా ఎలాంటి ఆందోళనలు నిర్వహించాలన్న దానిపై చర్చించనున్న వైయస్‌.జగన్‌… స్వయంగా తాను కూడా ఆందోళనల్లో పాల్గొనే ఆలోచనలో ఉన్నారు. ధాన్యం సేకరణ, రైతులను దోచుకుంటున్న దళారులు తదితర అంశాలపైనా చర్చ జరగనుంది. త్వరలోనే నిర్వహించే ప్రజా పోరాటాలపైనా చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంపై కార్యాచరణ సిద్దం చేసుకుని… వాటిని నేతలకు వివరిస్తారు జగన్.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్