Monday, October 27, 2025 10:33 PM
Monday, October 27, 2025 10:33 PM
roots

అంబటి… ఇక సంక్రాంతి డ్యాన్స్ వేసుకోవటమేనా..!

అంబటి రాంబాబు… తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఈ పేరు తెలియని వారుండరు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే సంబరాల రాంబాబు, గంట, సంజన, సుకన్య అంటూ ఈయన మీద తెగ జోకులు వేస్తుంటారు నెటిజన్లు. వైఎస్ రాజశేఖరరెడ్డి వీరాభిమానిగా గుర్తింపు తెచ్చుకున్న అంబటి.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరి కీలకంగా వ్యవహరించారు. తొలినుంచి జగన్ వీరభక్తుల జాబితాలో రాంబాబు కూడా ఒకరు.

Also Read : వాళ్లంతా వేస్ట్… ఆ జిల్లా నేతలపై జగన్ ఫైర్..!

2019 సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై పోటీ చేసి గెలిచారు. ఇక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో కీలకమైన జలవనరుల శాఖ కేటాయించారు జగన్. అయితే ఆ శాఖ మీద ఎలాంటి పట్టు లేదని అంబటి చేసిన వ్యాఖ్యలతో తేలిపోయింది. పోలవరం ప్రాజెక్టు గురించి ఏమాత్రం అర్థం కాలేదంటూ చేసిన వ్యాఖ్యలతో అభాసుపాలయ్యారు. దీనికి తోడు ప్రతి ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి మంటల చుట్టూ డాన్స్ చేయటం అంబటి స్పెషల్. ఇవి సరిపోవన్నట్లు… ఓ మహిళతో మాట్లాడిన ఫోన్ కాల్… అంబటి రాంబాబు పేరును కాంబాబు అని, సంజన, సుకన్య అంటూ నెటిజన్లు మార్చేశారు.

Also Read: పోలీసుల ముందు బోరుగడ్డ సంచలన విషయాలు 

అయితే సత్తెనపల్లి నా అడ్డా అంటూ గొప్పలు చెప్పుకునే అంబటికి వైసీపీ అధినేత జగన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సత్తెనపల్లి నియోజకవర్గం వైసీపీలో గ్రూప్ తగాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అంబటిని ఇంఛార్జి పదవి నుంచి తొలగించాలని ఇప్పటికే స్థానిక వైసీపీ నేతలు బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. దీంతో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సత్తెనపల్లి వైసీపీ బాధ్యతలను మరో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి అప్పగించనున్నట్లు విశ్వాసనీయ సమాచారం. ఒకటి రెండు రోజుల్లో ఆర్కే పేరు అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే… రాంబాబు ఇంకా సంక్రాంతి డ్యాన్స్ వేసుకోవడమే అంటూ అటు వైసీపీలో ఇటు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్