ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజకీయం కాస్త వింతగా ఉంటుంది అనే కామెంట్స్ మనం వింటూనే ఉంటాం. తప్పు చేసినా సరే దాన్ని కవర్ చేసుకోవడానికి జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తాజాగా అయన నిర్వహించిన ఓ ప్రెస్ మీట్ సంచలనం అవుతోంది. అసలు తన పరిపాలనలో ఎవరినీ వేధించలేదు అన్నట్టుగా జగన్ మాట్లాడిన మాటలు చూసి వైసీపీ నేతలు కూడా షాక్ అవుతున్నారు. ఈ రికార్డెడ్ ప్రెస్ మీట్ లో జగన్ కొన్ని కామెంట్స్ చేసారు. అవి ఏంటీ అనేది చూస్తే…
Also Read : కవిత మౌనం.. రాజకీయ వ్యూహమా?
‘వ్యూహం’ సినిమా తీసారని వర్మను అరెస్ట్ చేస్తున్నారు… మరీ ‘వివేకం’ సినిమా తీయలేదా అన్నారు. వైసీపీ సోషల్ మీడియాపై తప్పుడు కేసులు పెడుతున్నారని… బాలకృష్ణ ఇంట్లో కూర్చుని… షర్మిలపై తప్పుడు ప్రచారం చేయలేదా అంటూ మాట్లాడారు. తన కుటుంబం గురించి అభ్యంతరకరంగా తల్లి, చెల్లి, కుటుంబ విభేదాలు అంటూ మాట్లాడారని కామెంట్స్ చేసారు. వివేకం సినిమా పూర్తిగా సిబిఐ నివేదికని ఆధారం చేసుకుని తీసిన సినిమా. దానికి అసలు వాస్తవాలు లేకుండా తీసిన సినిమాకి చాలా తేడా ఉందని జగన్ గుర్తించాలి. అసలు వివేకం సినిమా కంటే ముందే… ‘కమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ పేరుతొ కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు.
అయితే సెన్సార్ బోర్డు ఆ పేరుని అంగీకరించకపోవడంతో దాన్ని ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అంటూ మార్చారు. అందులో చంద్రబాబును అత్యంత దారుణంగా చూపించారు. లోకేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ను అభ్యంతరకంగా చూపించారు. ఆ సినిమాలు జగన్ చూసే ఉంటారు కదా…? ఆ తర్వాతే కదా వివేకం సినిమా వచ్చింది. వైసీపీ సోషల్ మీడియాపై తప్పుడు కేసులు అని మాట్లాడారు జగన్. వైసీపీ హయాంలో హైదరాబాద్ లో ఉన్న వాళ్ళను కూడా వేధించి… ఖమ్మంలో ఉన్న వాళ్ళ దగ్గర కంప్యూటర్లు లాక్కుని, కెమెరాలు లాక్కుని… వాటిని వైసీపీ సోషల్ మీడియాకు ఇవ్వలేదా…? ఆ సంగతి జగన్ ఎలా మర్చిపోతారు.
Also Read : అదానీ దెబ్బతో జగన్ మెడకు బిగుస్తున్న ఉచ్చు
బాలకృష్ణ ఇంట్లో కూర్చుని తప్పుడు ప్రచారం అని మరో మాట జగన్ మాట్లాడారు. షర్మిలపై అప్పట్లో తప్పుడు ప్రచారం చేసింది టీడీపీ కార్యకర్తలు అని ఇప్పటి వరకు వైసీపీ కార్యకర్తలు గాని, ఆ పార్టీ అధినాయకత్వం గాని ఒక్క సాక్ష్యం బయటపెట్టలేదు. ఇక తన చెల్లి తనతో విభేదించిన సమయంలో శ్రీరెడ్డి, వైసీపీ సోషల్ మీడియాలోని కొందరు మహిళలతో షర్మిలను వినలేని బూతులతో తిట్టించింది ఎవరు…? మరి వీటికి కూడా జగన్ సమాధానం చెప్పాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా చెయ్యాల్సిన దరిద్రం అంతా చేసి ఇప్పుడు సుద్దపూస కబుర్లు చెబితే వినేవాళ్ళు ఎవరూ లేరన్న సంగతి గుర్తిస్తే మంచిది.