Saturday, September 13, 2025 05:12 AM
Saturday, September 13, 2025 05:12 AM
roots

పాత ఫార్ములాకు దుమ్ము దులుపుతున్న జగన్..!

వర్కవుట్ అయిన ప్లాన్‌ బెటర్ కదా.. కొత్త ప్లాన్ ఎందుకు అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నట్లున్నారు. ఐదేళ్లు తాను అధికారంలోకి రావడానికి ఉపయోగపడిన అదే సెంటిమెంట్ గేమ్ ప్లే చేసేందుకు జగన్ అండ్ కో టీమ్ భారీ ఎత్తున ప్లాన్ చేస్తోంది. ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో తెలియదు కానీ.. రెండేళ్ల తర్వాత ప్రణాళిక అమలు చేసేందుకు ఇప్పటి నుంచే ముమ్మర కసరత్తు చేస్తున్నారు. పార్టీ నేతలతో జగన్ కూడా నిత్యం సమాలోచనలు చేస్తున్నారు. ఇందుకోసం విడతల వారీగా అనుబంధ విభాగాలతో సమావేశం అవుతున్నారు. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు కూడా. ప్లాన్ ఎప్పుడు అమలు చేస్తే బాగుంటుంది.. ఎలా చేస్తే బాగుంటుందా అని సమాలోచనలు చేస్తున్నారు. ఇంతకీ ఏమిటా ప్లాన్ అనుకుంటున్నారా.. పాదయాత్ర ప్లాన్.

Also Read : పట్టు బిగిస్తున్న కాంగ్రెస్.. మోడీ దొరికిపోయారా..?

2019 ఎన్నికలకు రెండేళ్ల ముందు పాదయాత్ర చేపట్టారు జగన్. ఇడుపులపాయలో మొదలుపెట్టి.. అక్కడ నుంచి ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేశారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. అన్ని వర్గాల ప్రజలను కలిశారు. లెక్కలేనన్ని హామీలు ఇచ్చారు. ప్రతి ఒక్కరు చెప్పింది విన్నారు.. నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ భరోసా ఇచ్చారు. అన్నోస్తున్నాడు.. అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పారు. నవరత్నాలు అంటూ ఊదరగొట్టారు. నాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేశారు. అమరావతిని గ్రాఫిక్స్ అన్నారు.. ప్రభుత్వ పథకాలు అమలు కావడం లేదని నోటికి వచ్చినట్లు ఆరోపణలు చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ ఓట్లు అడిగారు. ప్రజలు కూడా కేవలం ఒక్కటే ఛాన్స్ అని ఇచ్చి.. లాగేసుకున్నారు.

Also Read : భూమి పై జీవం అంతం కానుందా..?

వై నాట్ 175 అని గొప్పగా చెప్పిన జగన్.. చివరికి ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకోలేకపోయారు. పరువు పోవడంతో చివరికి చేసేది లేక తాడేపల్లి ప్యాలెస్ కూడా ఖాళీ చేసి.. నేరుగా బెంగళూరు ఎలహంక ప్యాలెస్‌కు మకాం మార్చేశారు. అక్కడి నుంచే పార్టీలో ఒకరిద్దరు నేతల ద్వారా పార్టీని నడిపిస్తున్నారు. అయితే చిన్న చిన్న ఘటనలు జరిగితే.. వాటిని జగన్ భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు. సొంత మీడియా అండతో లేని పోని ఆరోపణలు చేస్తున్నారు జగన్. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందంటూ జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. తమ పార్టీ కార్యకర్తలు, నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని గగ్గొలు పెడుతున్నారు. అందుకే ఇప్పటి నుంచే మూడేళ్లల్లోనే అధికారంలోకి వస్తామంటూ ధీమాగా చెబుతున్నారు జగన్.

Also Read : బ్రేకింగ్: ఏపీ లిక్కర్ స్కాంలో షేకింగ్ న్యూస్

చంద్రబాబు సర్కార్‌పై వ్యతిరేకత ఉందని.. అదే తనకు అనుకూలంగా మారుతుందని జగన్ బలంగా నమ్ముతున్నాడు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. ఇప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదని ఆరోపిస్తున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు నిరంతరం ప్రజల్లో తిరగాలని జగన్ సూచిస్తున్నారు. అదే సమయంలో తాను కూడా పాదయాత్ర చేసేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు సరిగ్గా రెండేళ్ల ముందు పాదయాత్ర చేస్తే బాగుంటుందని ఇప్పటికే పార్టీ నేతలు సలహా ఇచ్చినట్లు సమాచారం. 2027లో అయితే అప్పటికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతుంది.. కాబట్టి.. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తారాస్థాయికి చేరుతుందని.. దానిని తనకు అనుకూలంగా మలుచుకోవాలంటే మాత్రం.. అప్పుడే పాదయాత్ర చేస్తే బాగుంటుందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జగన్ ప్రజల్లోకి వస్తే మాత్రం… ఐదేళ్ల కాలంలో జగన్ చేసిన అరాచకాలను ప్రజలు నిలదీస్తే పార్టీ పరిస్థితి ఏమిటీ అని కొందరు వైసీపీ నేతలే భయపడుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్