Friday, September 12, 2025 09:05 PM
Friday, September 12, 2025 09:05 PM
roots

జగనన్న.. ఎక్కడున్నావు.. ఏమయ్యావు..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే ప్రశ్న. అసలు అధినేత జగన్ ఎక్కడా.. ఏమయ్యారు.. ఏపీలో ఉన్నారా.. లేరా.. ఎక్కడికెళ్లారు.. ఇవే ప్రశ్నలు వైసీపీలో కార్యకర్త మొదలు.. రాష్ట్ర స్థాయి నేతల వరకు వేస్తున్నారు. అదేంటి.. నిన్ననే కదా రౌడీషీటర్లను పరామర్శించడానికి తెనాలి వెళ్లారు జగన్.. ఇంతలోనే ఏమయ్యారు.. వైసీపీ నేతల్లో, కార్యకర్తల్లో ఎందుకీ అనుమానం.. అనేది ఏపీ ప్రజల ప్రశ్న. నిజమే.. సరిగ్గా 24 గంటల ముందు మందీ మార్భలం వేసుకుని తెనాలి వెళ్లారు జగన్. అక్కడ రౌడీ షీటర్లను పోలీసులు దండించారంటూ వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించారు. అవును.. తప్పు చేశారు.. అయితే కొడతారా అంటూ పోలీసులను నిలదీశారు కూడా. ఇది కూటమి ప్రభుత్వం దళితులపై చేస్తున్న దాడి అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పారు.

Also Read : కామెడీ స్పీచ్ ఇరగదీసిన జగన్

ఇదంతా 24 గంటల ముందు జరిగిన వ్యవహారం. తెనాలిలో పోలీసులు గంజాయ్ బ్యాచ్‌కు బహిరంగంగా కోటింగ్ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే దీనిపై వైసీపీ నేతలు రాజకీయాలు చేశారు. దళితులపై కూటమి ప్రభుత్వం దాడి, దాష్టికం అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పారు. చివరికి వైసీపీ అధినేత రౌడీ షీటర్ ఇంటికి స్వయంగా వెళ్లి పరామర్శించారు కూడా. గతంలో తప్పులు చేశారు.. మళ్లీ చేస్తారు.. అంత మాత్రానికి పోలీసులు ఇలా కొడతారా.. శిక్షించడానికి పోలీసులకు ఉన్న అధికారం ఏమిటీ అంటూ నిలదీశారు. అయితే జగన్‌ తీరుపై ఎమ్మార్పీఎస్ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు కూడా. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దళితులపై దాడులు జరిగితే జగన్ ఎక్కడున్నారన్నారు. దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే.. అప్పుడు ఎందుకు ఇలా పరామర్శించలేదని విమర్శించారు కూడా.

Also Read : బ్రహ్మపుత్ర నదికి చైనా బ్రేక్ వేస్తే..?

అయితే ఎన్నికల ఫలితాలు వచ్చి సరిగ్గా ఏడాది పూర్తవుతున్న సందర్భంగా వెన్నుపోటు దినం పేరుతో రాష్ట్రస్థాయి నిరసనలకు వైసీపీ పిలుపునిచ్చింది. ప్రతి జిల్లా కేంద్రంలో, నియోజకవర్గంలో, ఊరిలో కూడా నిరసన ప్రదర్శన చేపట్టాలని స్వయంగా అధినేత జగన్ పిలుపునిచ్చారు. అసలు ఫలితాలు వచ్చిన రోజును వెన్నుపోటు దినం అని ఎందుకు అంటారూ అంటే.. దానికి వైసీపీ నేతల దగ్గర జవాబు లేదు. ప్రజలు వైసీపీకి వెన్నుపోటు పోడిచినట్లుగా జగన్ భావిస్తున్నారని.. అందుకే ఫలితాలు వచ్చిన రోజును వెన్నుపోటు దినం అని జరపాలని జగన్ సూచించినట్లు కొందరు వైసీపీ నేతలే విమర్శలు చేశారు కూడా. పథకాల రూపంలో తాను ఇచ్చిన డబ్బులు తీసుకుని.. ఎన్నికల్లో తనకు ఓటు వేయకుండా ఏపీ ప్రజలు వెన్నుపోటు పొడిచారనేది జగన్ భావన.

Also Read : మాజీ క్రికెటర్ కు బీజేపీ గాలం.. ఈసారి వర్కౌట్ అవుతుందా..?

ఈ వెన్నుపోటు దినం కోసం వైసీపీ నేతలు రోడెక్కారు. ఇంతవరకు బాగానే ఉంది.. అసలు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కడా అనేది ఇప్పుడు వైసీపీ అభిమాని ప్రశ్న. ఆయన ఎక్కడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనలేదు. చివరికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు కూడా రాలేదు. అసలు తాడేపల్లిలో ఉన్నారా.. లేక బెంగళూరు వెళ్లిపోయారా అనేది వైసీపీ కార్యకర్త అనుమానం కూడా. బైపాస్ సర్జరీ చేయించుకున్న బొత్స వంటి నేతలు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ జగన్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఇదెక్కడి తీరు అని వైసీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : తెనాలి పర్యటన వెనుక ఇంత కుట్ర ఉందా..?

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాది. ఈ ఏడాది కాలంలో ఏపీలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అంబేద్కర్ రాజ్యంగం అమలు చేయటం లేదని.. రెడ్ బుక్ పాలన నడుస్తోందని గగ్గొలు పెడుతున్నారు. చివరికి ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయటం లేదని కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇక ఏడాది కాలంలో ఎన్నో విషయాల్లో ఆందోళన చేయాలని జగన్ పిలుపునిచ్చారు. రైతులకు గిట్టుబాటు ధర లేదని.. ధాన్యం కొనుగోలులో అక్రమాలు జరుగుతున్నాయని.. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించడం లేదంటూ నిరసన కార్యక్రమాలకు వైసీపీ అధినేత సూచించారు. ఇక విద్యుత్ చార్జీల పెంపు అంటూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కూడా చేపట్టారు వైసీపీ నేతలు. ఇవన్నీ అధినేత జగన్ స్వయంగా పిలుపు మేరకే వైసీపీ నేతలు నిర్వహించారు.

Also Read : మతం కార్డు.. మలేషియాలో పాక్ డ్రామాలు

కానీ ఇందులో ఒక్క కార్యక్రమంలో కూడా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొనలేదు. కేవలం ఆదేశాల వరకే జగన్ పరిమితం అవుతున్నారని.. తాను కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలనే స్పృహ జగన్‌లో లేదంటున్నారు వైసీపీ నేతలు. వెన్నుపోటు దినం అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పిన జగన్.. ఆ కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదో చెప్పాలని కొందరు నేతలు నిలదీస్తున్నారు కూడా. పార్టీ అధికారంలోకి వస్తే.. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేది జగన్.. కానీ కార్యకర్తలు, నేతలు మాత్రం రోడ్డెక్కి ప్రభుత్వంతో కేసులు పెట్టించుకోవాలా అని ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనకపోతే.. వారిపై సీరియస్ అవుతున్నారని.. చర్యలు కూడా తీసుకుంటున్నారని గుర్తు చేస్తున్నారు. అధికారంలో ఉన్నంత కాలం కార్యకర్తలను, నేతలను జగన్ పట్టించుకోలేదని.. జగన్‌ చేసిన చర్యల వల్లే ప్రజలు పార్టీకి వెన్నుపోటు పొడిచి ఓడించారనేది సగటు వైసీపీ కార్యకర్త మాట. అసలు వైసీపీకి జగనే అతిపెద్ద వెన్నుపోటు దారుడని.. అందుకే ముఖ్యనేతలంతా వెళ్లిపోయారనేది పార్టీ నేతలు, కార్యకర్తల మాట. మరి ఈ ప్రశ్నలకు జగన్ ఏం సమాధానం చెప్తారో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్