Saturday, September 13, 2025 01:21 AM
Saturday, September 13, 2025 01:21 AM
roots

స్వామీజీలతో జగన్ నయా ప్లాన్

తిరుమల లడ్డు విషయంలో ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ మల్లగుల్లాలు పడుతున్నారు. హిందు సమాజం ఇప్పుడు జగన్ ను దోషిగా చూడటంతో ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితిలో ఉన్నారు వైసీపీ అధినేత. పార్టీ నేతలు ఎన్ని సలహాలు ఇస్తున్నా వాటిని అమలు చేయలేని పరిస్థితి కూడా జగన్ ది. రాజకీయంగా ఇది జగన్ కు అత్యంత ప్రమాదకర పరిస్థితి. ప్రత్యర్ధులను ఎదుర్కోవడానికి జగన్ ఎన్నో విధాలుగా రాజకీయం చేస్తూ ఉంటారు. అలాంటి జగన్ కు ఇలాంటి పరిస్థితి రావడం అనేది కాస్త వింతగానే ఉంది వైసీపీ నేతలకు.

పూజలు చేసినా, విమర్శలు చేసినా ప్రజల్లో ఈ విషయంలో అనుమానం తొలగడం లేదు. జగన్ రాజకీయ భవిష్యత్తుకె ఇది ప్రమాదకరంగా మారిన అంశంగా చెప్పాలి. నానీలు మీడియా సమావేశం పెట్టినా, సోషల్ మీడియాలో పెయిడ్ బ్యాచ్ తో ఏదో రకంగా వివరణలు ఇప్పించే ప్రయత్నం చేసినా అసలు 320 కి నెయ్యి ఎలా వస్తుందనే ప్రశ్నే ప్రజల్లో అనుమానాలకు తావు ఇస్తోంది. దీనితో ఇప్పుడు జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు సిద్దమవుతున్నట్టుగా తెలుస్తోంది. తనను మూకుమ్మడిగా అన్ని వైపుల నుంచి దాడి చేయడంతో బహిరంగ సభలకు జగన్ సిద్దమవుతున్నారు.

Read Also : మానసిక ఒత్తిడిలో జగన్

ఇటీవల జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏ రూపంలో క్లారిటీ ఇచ్చినా అది వర్కౌట్ కాలేదు. పైగా కొత్త అనుమానాలు ఏర్పడ్డాయి. ఇక సిట్ విచారణ కూడా కొలిక్కి వస్తోంది.  దీనితో జగన్ అన్ని విధాలుగా ఇరుక్కుపోయారు. సిట్ విచారణలో ఏ విషయాలు బయటకు వస్తాయో తెలియదు. ఇక దీనిపై సిబిఐ విచారణ చేయించే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనితో జగన్ బహిరంగ సభలు పెట్టి తన్న వెర్షన్ ప్రజలకు వినిపించాలని భావిస్తున్నారు. వైసీపీలో ఉన్న ఇతర మతాల నేతలను ఈ విషయంలో ఇప్పటికే సైలెంట్ చేసారు. ఇక హిందూ నేతలతో, కొందరు స్వామీజీలతో కలిసి జగన్ పర్యటనలకు సిద్దమవుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్