ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉండటం.. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవడంతో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇబ్బందులు పడుతున్నారు. మీడియా సమావేశాల్లో వైయస్ జగన్ కాన్ఫిడెంట్ గా మాట్లాడినా.. ఆయనలో ఆందోళన కనబడుతోంది అనేది ప్రధానంగా వినపడుతున్న మాట. 2019 తర్వాత లిక్కర్ కుంభకోణం పెద్ద ఎత్తున రాష్ట్రంలో జరిగింది. దీనికి సంబంధించి పక్క ఆధారాలను ప్రత్యేక దర్యాప్తు బృందం సేకరించి విచారణ చేపడుతోంది.
Also Read : పెద్దల సభకు కమల్ హాసన్.. స్టాలిన్ సంచలన నిర్ణయం
ఈ విషయంలో త్వరలోనే మరిన్ని కీలక అరెస్టులు ఉండే అవకాశం ఉందనే ప్రచారం సైతం జరుగుతుంది. ఇప్పటికే వైయస్ జగన్ మాజీ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన ఏ సమాచారం ఇస్తారు అనే దానిపైనే సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ సమయంలో జాతీయస్థాయిలో తనకు మద్దతు కోసం జగన్ తీవ్రంగా కష్టపడుతున్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఈ విషయంలో ఒకవేళ తనను అరెస్టు చేస్తే జాతీయస్థాయిలో మద్దతు కావాలి అని జగన్ ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఇందుకోసం ఢిల్లీ వెళ్లాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Also Read : ఏపి డిప్యూటీ సీఎం మాస్ వార్నింగ్..!
విజయ సాయి రెడ్డి ఉన్న సమయంలో ఢిల్లీలో ఇటువంటి వ్యవహారాలకు జగన్ ఏదో ఒక రూపంలో జాగ్రత్తగా రాజకీయం చేసేవారు. ఇప్పుడు విజయ్ సాయి రెడ్డి లేరు కాబట్టి ఇతర పార్టీలతో నేరుగా తానే మాట్లాడాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి ద్వారా.. జాతీయ పార్టీలకు దగ్గర కావాలని భావిస్తున్నారట. కాంగ్రెస్ లో ఉన్న తన సన్నిహితుల ద్వారా కూడా జగన్ ప్రయత్నాలు వేగవంతం చేసినట్లు సమాచారం. ఓ మాజీ రాజ్యసభ ఎంపీ ఇప్పటికే జగన్ తరుపున ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. జూన్ మొదటి వారంలో లేదా రెండో వారంలో ఢిల్లీ వెళ్లి జాతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి.




