Saturday, September 13, 2025 01:17 AM
Saturday, September 13, 2025 01:17 AM
roots

వైసీపీలో మార్పులు.. మరి సీనియర్ల పరిస్థితి ఏమిటో..?

ఎక్కడో తప్పు జరిగింది… దానిని సరిదిద్దుకుంటాం.. మళ్లీ అధికారంలోకి వస్తామంటున్నారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అయితే ఆ తప్పు ఏమిటంటే.. చాలా నియోజకవర్గాల్లో పోటీ చేసిన నేతలే అనే మాట చెప్పకనే చెబుతున్నారు. చాలా నియోజకవర్గాల్లో సిట్టింగ్ అభ్యర్థుల మీద ఉన్న ఆరోపణల వల్లే ఓడినట్లు కొందరంటుంటే… కొన్ని చోట్ల మాత్రం చివరి నిమిషంలో మార్పులు చేర్పులు చేయడం వల్ల ఓడామనేది కొందరి అభిప్రాయం. ప్రజలకు ఎన్నో మంచి పనులు చేశామని… అయినా సరే ఘోర పరాజయానికి కారణం మాత్రం అభ్యర్థులే కారణమంటున్నారు తప్ప… అధినేత తీరును మాత్రం తప్పుబట్టడం లేదు.

Also Read : పెండింగ్ బిల్లుల పైనే ఫోకస్.. బాబు ప్లానింగ్ ఇదే..!

వాస్తవానికి ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో వైఎస్ జగన్ పార్టీని, ప్రభుత్వాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదనే చెప్పాలి. పార్టీని, ప్రభుత్వాన్ని కూడా నెంబర్ టూ నేతలే నడిపారు అనేది బహిరంగ రహస్యం. సకల శాఖ మంత్రిగా గుర్తింపు తెచ్చుకున్న సజ్జల రామకృష్ణారెడ్డిని కలిస్తే ఏ పని అయినా అవుతుందనేది పార్టీలో అందరికీ తెలిసిన విషయం. పదవి కావాలంటే సజ్జల కరుణ ఉండాల్సిందే అంటారు. అందుకే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన విడదల రజినీకి మంత్రిపదవి వచ్చిందంటున్నారు. ఐదేళ్ల పాటు పూర్తిగా ప్యాలెస్‌కు పరిమితమైన జగన్… ఓటమి తర్వాత తత్వం భోద పడినట్లుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకే ఇప్పుడు కొత్త నియామకాలు చేపడుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.

గ్రామ స్థాయి మొదలు రాష్ట్రస్థాయి వరకు పదవుల భర్తీ ప్రక్రియకు జగన్ శ్రీకారం చుట్టారు. వైసీపీలో పదవుల భర్తీ దాదాపు పూర్తి కావస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో పార్టీ నేతలకంటే కూడా వలంటీర్లు, సచివాలయ వ్యవస్థ ఉద్యోగులకే జగన్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. దీని వల్ల ప్రజలకు, పార్టీకి మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయింది. ఏ పని కావాలన్నా సరే… నేరుగా వలంటీర్‌ను సంప్రదిస్తే చాలు.. అని స్వయంగా జగన్ ప్రకటించారు కూడా. ఇది పార్టీ నేతలను అప్పట్లో పెద్ద ఇబ్బందులకు గురి చేసింది కూడా. అన్నీ వలంటీర్లే చూసుకోవడంతో… పార్టీ నేతలకు కనీస గుర్తింపు కూడా రాలేదు.

Also Read : రైతు భరోసా మోసాలకు చెక్.. రేవంత్ కీలక అడుగులు…!

ఈ విమర్శలకు చెక్ పెట్టేందుకు ఇప్పుడు జగన్ స్వయంగా రంగంలోకి దిగారు. కూటమి సర్కార్ వైసీపీ నేతలు, కార్యకర్తలను వేధిస్తోందంటూ విమర్శలు చేస్తున్నారు. మీకు నేను అండగా ఉంటా అంటూ భరోసా ఇస్తున్నారు. కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత… గతంలో చేసిన తప్పులకు భయపడి పారిపోయిన వారంతా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. అలాంటి వారంతా నేరుగా జగన్‌ను కలుస్తున్నారు. అలాంటి వారికే జగన్ పార్టీ పదవులిచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు కూడా. దీంతో కొత్తవారికి అవకాశం ఇస్తుండటంతో… సీనియర్లు అంతా జగన్‌పై కాస్త గుర్రుగా ఉన్నారు. మా పరిస్థితి ఏమిటని నిలదీస్తున్నారు కూడా.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్