వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నోటికి ఏదో వస్తే అది మాట్లాడే వాళ్లకు చాలా ప్రాధాన్యత ఉండేది. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని, టిడిపి నాయకులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వైసిపి నాయకులకు సలహాదారు పదవులతో పాటుగా కీలక ఉద్యోగాలు ఇచ్చి జీతాలు చెల్లించిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు వీటి గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎనమల నాగార్జున యాదవ్ అనే వ్యక్తికి ఏపీ ఫైబర్ నెట్ ద్వారా చెల్లించిన జీతాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
Also Read : మిథున్ రెడ్డి లిక్కర్ కేసు మూలనపడినట్లేనా..?
నెలకు లక్ష 11 వేల రూపాయలు చొప్పున అతనికి మూడు ఏళ్లలో దాదాపు 40 లక్షల రూపాయలను చెల్లించింది ఫైబర్ నెట్. ఫైబర్ నెట్ లో సీనియర్ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా అతను జాయిన్ అయ్యాడు. ఏనాడు ఆ కార్యాలయానికి అడుగుపెట్టని నాగార్జున యాదవ్.. ఉదయం సాయంత్రం మీడియాతో మాట్లాడటం లేదా ఎక్కడైనా బహిరంగ సభ ఉంటే అక్కడకు వెళ్లి చంద్రబాబు కుటుంబాన్ని అలాగే టిడిపి నాయకులను తిట్టడం లక్ష్యంగా పెట్టుకుని పని చేసాడు. ఇందుకుగాను కృతజ్ఞతగా అతనికి.. భారీ మొత్తంలో జీతాలు చెల్లించిన పరిస్థితి. అంతేకాకుండా వైసిపి కార్యకర్తలకు కూడా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినందుకు 11వేల రూపాయల నుంచి 15,000 అలాగే 30,000 వరకు జీతాలు చెల్లించారు.
Also Read : పెద్దిలో తమిళ హీరో..? డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్..!
గుంటూరు జిల్లాకు చెందిన వైసిపి నాయకుడు మనోహర్ నాయుడు కు ఫైబర్ నెట్ నుంచి 80 వేల రూపాయలు జీతాలు వెళ్లాయి. ఇలా మొత్తం మూడేళ్ల కాలంలో ఆరు కోట్ల రూపాయలను బూతులు తిట్టిన వాళ్లకు జీతాల రూపంలో చెల్లించారు. డ్రోన్ కార్పొరేషన్ నుంచి అలాగే ఆప్కోస్ నుంచి పలువురిని నియమించుకుని.. వాళ్లకు జీతాలు ఇచ్చి ప్రతిపక్షాన్ని తిట్టించిన పరిస్థితి. ఇటీవల కూడా ఓ వైసీపీ కార్యకర్త ఫైబర్ నెట్ లో ఉద్యోగం సంపాదించడం గమనార్హం. వైసీపీ అధికారం కోల్పోయిన సరే ఫైబర్ నెట్ లో ఎక్కువగా వైసీపీకి అనుకూలంగా ఉండే వారే ఉన్నట్లు గుర్తించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని టిడిపి కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. టిడిపి కోసం కష్టపడిన వారు ఇంకా ఉద్యోగాల కోసం తిరుగుతుంటే.. వైసీపీలో ఉండి టిడిపిని తిడుతున్న వారికి ఇంకా ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.