Saturday, September 13, 2025 05:01 AM
Saturday, September 13, 2025 05:01 AM
roots

జగన్ ని నమ్ముకుంటే తమ్మినేనికి పట్టిన గతే అందరికీ..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు సొంత పార్టీ నేతలనే షాక్‌కు గురి చేస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు… అధికారంలో ఉన్నప్పుడూ… ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా జగన్ వేస్తున్న లెక్కలు అర్థం కాక సీనియర్ నేతలు సైతం తలలు పట్టుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీకి రాకుండా పాదయాత్ర చేసిన జగన్… ఆ తర్వాత 2014 ఎన్నికల సమయంలో నందిగాం సురేష్ వంటి రైతు కూలీకి ఎంపీ టికెట్ కేటాయించాడు. దీంతో ఇదేం లెక్క అని అంతా ఆశ్చర్యపోయారు. అయితే వైసీపీ హవాలో ఆ ఎన్నికల్లో సురేష్ గెలిచేశాడు.

ఇక ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న జగన్… మూడు రాజధానుల పేరుతో ప్రకటన వల్ల ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి లాభం పొందాలని చూశారు. ఇక ఎన్నికల్లో కూడా కేవలం సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని భావించారు. కానీ ఓటర్లు షాక్ ఇచ్చారు. దీంతో నేతలంతా జగన్ తీరుపై విమర్శలు చేసినప్పటికీ… ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇక తాజాగా తీసుకుంటున్న నిర్ణయాలు సొంత పార్టీ నేతలకు సైతం షాక్ ఇస్తున్నాయి. ఓటమి తర్వాత పార్టీలో మార్పులు, చేర్పులకు జగన్ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను మార్చేశారు.

Also Read : విడదల రజినీకి షాక్ ఇచ్చిన జగన్..!

చిలకలూరిపేట నియోజకవర్గానికి మాజీ మంత్రి విడదల రజినీని మళ్లీ నియమించారు. ఇక తాజాగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం ఇంఛార్జ్‌గా చింతాడ రవికుమార్‌ పేరు ప్రకటించారు జగన్. దీంతో సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఊహించని షాక్ ఇచ్చాడు జగన్. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ ప్రస్తానం ప్రారంభించిన తమ్మినేని 2009 వరకు టీడీపీలోనే కొనసాగారు. ఆ తర్వాత ప్రజారాజ్యంలో చేరినప్పటికీ… తిరిగి టీడీపీలోకి వచ్చారు. అయితే 2014 ఎన్నికల్లో చంద్రబాబు టికెట్ నిరాకరించడంతో… వెంటనే వైసీపీలోకి జంప్ అయ్యారు. ఇక 2019 ఎన్నికల్లో గెలిచిన తమ్మినేనిని స్పీకర్ స్థానంలో కూర్చొబెట్టారు.

అయితే అత్యున్నత స్థానంలో ఉన్న తమ్మినేని… రాజకీయాలకు అతీతంగా వ్యవహరించలేదు. రాజధాని ప్రాంతంపై అనుచిత వ్యాఖ్యలు, సభలో హుందాతనంగా వ్యవహరించలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇక గత ఎన్నికల్లో తనకు బదులుగా కుమారుడికి టికెట్ ఇవ్వాలని తమ్మినేని సీతారాం జగన్‌ను కోరారు. అయితే అధినేత మాత్రం.. ఈసారికి మీరే… నెక్స్ట్ టైమ్ గ్యారెంటీ అని హామీ ఇచ్చారు. దీంతో చేసేది లేక సరే అని ఒప్పుకున్న తమ్మినేని సీతారాం… సొంత మేనల్లుడు కూన రవికుమార్ చేతిలో రెండోసారి ఓడారు. ఇక తాజాగా చింతాడను నియోజకవర్గం ఇంఛార్జ్‌గా జగన్ నియమించడంతో… తమ్మినేని పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది.

Also Read :వరుణ్ తేజ్ కామెంట్స్ వెనుక వ్యూహం అదేనా…?

అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను నోటికి వచ్చినట్లు దూషించారు తమ్మినేని. ఇప్పుడు జగన్ కూడా పక్కన పెట్టడంతో… తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటనే విషయంపై తమ్మినేని మల్లగుల్లలు పడుతున్నారు. ఇన్ని రోజులు జగన్‌ను నమ్ముకుని ఉన్నందుకు తమకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేశాడని తమ వర్గం నేతల దగ్గర వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. చింతాడ రవికుమార్ నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమ్మినేని వర్గం… త్వరలో కీలక నిర్ణయం తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్