Friday, September 12, 2025 04:59 PM
Friday, September 12, 2025 04:59 PM
roots

పార్టీ నేతలకే నమ్మకం పోయింది..!

మాకు నమ్మకం లేదు దొర అంటూ లీడర్ సినిమాలో సీఎం స్థానంలో ఉన్న రానాతో ఓ ముసలాయన చెప్పే మాటలు. ఇప్పుడు ఇవే సరిగ్గా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సరిపోతున్నాయి. అనాలోచితంగా తీసుకునే నిర్ణయాలు పార్టీకి చెడ్డపేరు తీసుకువస్తాయి. అలాగే పార్టీపై జనాల్లో ఉండే నమ్మకం కూడా పోతుంది. ఇప్పుడు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. చెప్పాడంటే… చేస్తాడంతే అనే వైసీపీ నేతలే… చెప్పాడంటే… వాయిదా వేస్తాడంతే అంటున్నారు.

Also Read : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్‌..!

ఈ నెల 5న ఫీజు పోరు నిర్వహించాలని వైసీపీ అధిష్ఠానం నిర్ణయించింది. బకాయి పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన కింద ఇవ్వాల్సిన రూ.3,900 కోట్లు తక్షణమే విడుదల చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఫీజు పోరుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించడంతో మార్చి 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు వైసీపీ అధిష్ఠానం ప్రకటన జారీ చేసింది. ఇప్పుడు ఇదే విషయంపై వైసీపీ నేతలు, కార్యకర్తలు విమర్శలు చేస్తున్నారు. ఆ మాత్రం ముందు చూపు లేకుండా ఈ తొందరపాటు చర్యలు ఎందుకు అని నిలదీస్తున్నారు.

Also Read : కండలు కరగకుండా బరువు తగ్గాలంటే.. ఇవి ఫాలో అవ్వండి..!

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిల చెల్లింపుపై దృష్టి పెట్టింది. ఫీజు రియింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిల్లో ఇప్పటికే రూ.800 కోట్లు విడుదల చేసింది. త్వరలోనే మిగిలిన బకాయిలు కూడా చెల్లిస్తామని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. అయితే త్వరలో అనే మాటను వైసీపీ నేతలు పట్టుకున్నారు. ఎప్పుడిస్తారో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి డిసెంబర్ నెలలోనే ఫీజు పోరుకు పిలుపిచ్చారు. అయితే జగన్ లండన్ పర్యటన కారణంగా అది ఫిబ్రవరి 5కు వాయిదా వేశారు. ఇంతలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇప్పుడు మార్చి 12 అంటున్నారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఇలా తేదీలు మార్చడం ఏమిటనేది సగటు వైసీపీ నేత, కార్యకర్త మాట. ఇలా వాయిదా వేస్తూ పోతే ప్రజల్లో పార్టీపై నమ్మకం పోతుందని విమర్శిస్తున్నారు. మార్చి 12 అంటే పరీక్షల సమయం అని… కాబట్టి.. విద్యార్థులు ఎవరూ ఈ దీక్షలో పాల్గొనే పరిస్థితి లేదంటున్నారు. ఇంత అనాలోచితంగా నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

పోల్స్