వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. ఇంకా చెప్పాలంటే ఏపీ పాలిటిక్స్‌లో జగన్ చేస్తున్న పని హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ జగన్ ఏం చేశాడనేదే కదా ప్రశ్న. గతంలో అధికారంలో ఉన్న సమయంలో నాటి ప్రతిపక్ష నేతపై జగన్ ఎన్నో సార్లు తీవ్ర విమర్శలు చేశారు. పొరుగు రాష్ట్రం హైదరాబాద్‌లో ఉంటాడని… ఏపీకి చుట్టం చూపుగా వస్తున్నాడని… కనీసం సొంత ఇల్లు కూడా ఇక్కడ లేదంటూ తీవ్ర విమర్శలు చేశారు. అదే సమయంలో గెలిచిన తర్వాతే అసెంబ్లీకి వస్తానని చంద్రబాబు శపధం చేసి బయటకు వచ్చిన తర్వాత… సభలో చర్చించాలంటే భయపడుతున్నారంటూ వక్రీకరించి వ్యాఖ్యలు చేశారు.
Also Read: సిఆర్డీఏ కమీషనర్ వర్సెస్ నారాయణ… చంద్రబాబు కీలక నిర్ణయం
ఇక అదే సమయంలో ప్రస్తుత మంత్రి నారా లోకేష్ పై కూడా వైసీపీ నేతలు ఇదే తరహా విమర్శలు చేశారు. హైదరాబాద్ నుంచే ఏపీ రాజకీయాలు చేస్తున్నారని… ఇంకా చెప్పాలంటే జూమ్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ నోటికి వచ్చినట్లు వ్యాఖ్యానించారు. బండ్లు ఓడలవుతాయి… ఓడలు బండ్లు అవుతాయనే సామెత వైసీపీ విషయంలో అక్షరాల నిజమైంది. 151 సీట్లతో మేమే రాజు అన్నట్లుగా విర్రవీగిన వైసీపీ నేతలకు చివరికి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. మంత్రివర్గంలో ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా మిగిలిన వారంతా ఘోరంగా ఓడిపోయారు. దీంతో తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియక ఇప్పుడు సైలెంట్‌గా సైడ్ అయిపోయారు. కొందరు కీలక నేతలైతే జగన్ తీరుతో విసిగిపోయి వైసీపీకి రాజీనామా చేశారు.
Also Read: మీవల్లే ఇదంతా.. ఎస్పీలు, డీఎస్పీలపై చంద్రబాబు ఫైర్
కొందరు నేతలైతే… జగన్ దెబ్బకు రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఇదే సమయంలో జగన్ తీరుపై ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ్ చర్చ నడుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు కుటుంబం హైదరాబాద్‌లో ఉంది. అయినా సరే… ఉండవల్లి ఇంటికి తరచూ వచ్చారు. అలాగే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఏపీలో ఏ చిన్న కార్యక్రమానికైనా హాజరయ్యారు. కరోనా సమయంలో తప్ప పార్టీ సమావేశాలు నిర్వహించారు. మహానాడు మీటింగ్‌లు, నేతలతో భేటీలు నిర్వహించారు. అదే సమయంలో వారంలో నాలుగు రోజుల పాటు పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు కూడా. విశాఖ, తిరుపతి ఎయిర్ పోర్టులో చంద్రబాబును అడ్డుకున్నా… అమరావతి ప్రాంతంలో రాళ్ల దాడి చేసినా ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు.
Also Read: ఎవరీ వినయ్…? సాక్షి టూ మోహన్ బాబు యూనివర్సిటీ
కానీ జగన్ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నారు. ఓడిన వెంటనే మకాం బెంగళూరుకు మార్చాడు. ఏదో చుట్టపు చూపుగా నెలలో రెండు సార్లు తాడేపల్లి వస్తున్నాడు. అలా వచ్చినప్పుడు మాత్రం నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నాడు తప్ప… బయటకు రావడం లేదు. ఇక అసెంబ్లీ సమావేశాలకు అయితే జగన్ కుంటి సాకులన్నీ చెబుతున్నాడు. తాడేపల్లి టూ గన్నవరం ఎయిర్ పోర్టు టూ బెంగళూరు… మళ్లీ బెంగళూరు టూ గన్నవరం టూ తాడేపల్లి అన్నట్లుగా షటీల్ సర్వీస్ చేస్తున్నాడు జగన్. దీంతో గతంలో నువ్వు ఏ విమర్శలు చేశావో… ఇప్పుడు అవే నీకు తగులుతున్నాయి కదా జగన్.. అని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మాట మీది నిలబడేది లేదని మరోసారి రుజువు చేశావు కదా జగన్… అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు.