వైసీపీ అధినేత వైయస్ జగన్ బిజెపికి దగ్గరగా ఉన్నారా లేదంటే కాంగ్రెస్ కు దగ్గరగా ఉన్నారా అనేది చెప్పడం కాస్త కష్టమే. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పై ఆయన ఎటువంటి విమర్శలు చేయలేదు. 2024 లో అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ కు కాస్త దగ్గర అయ్యే ప్రయత్నాలు చేశారు జగన్. విజయ సాయి రెడ్డి ద్వారా కాంగ్రెస్ పార్టీ పెద్దలకు దగ్గర కావడానికి ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేసినా సరే అవి పెద్దగా సఫలం కాలేదు.
Also Read : ఏపీ ఫ్యూచర్ సీఎంపై క్లారిటీ..!
దానికి తోడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల ఉండటం కూడా జగన్ మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టింది. కానీ కాంగ్రెస్ పై విమర్శలు మాత్రం జగన్ బహిరంగంగా ఎప్పుడు చేయలేదు. కానీ తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాత్రం రాహుల్ గాంధీ పై విమర్శలు చేశారు. ఎన్నికల సంఘంపై పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ.. ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడలేదు అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ముగ్గురు హాట్ లైన్ లో ఉన్నారని.. అందుకే విమర్శలు చేయలేదంటూ జగన్ వ్యాఖ్యానించారు.
కానీ ఓటర్ లిస్టు విషయంలో బిజెపిని విమర్శించే ప్రయత్నం జగన్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలకు సైతం ఆయన మద్దతు ఇవ్వలేదు. రాహుల్ గాంధీతో చంద్రబాబుకు ఉన్న సంబంధాలపై మాత్రమే మాట్లాడారు జగన్. అయితే ఈ విషయంలో బిజెపిపై జగన్ విమర్శలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన ఇరుకున పడే అవకాశం ఉంటుందనే మాట్లాడలేదు అంటున్నాయి రాజకీయ వర్గాలు. అయితే రాహుల్ గాంధీ మాట్లాడకపోవడం వెనక కారణాలను కూడా పలువురు బయటపెడుతున్నారు.
Also Read : ఇలా అయితే కష్టం.. చంద్రబాబు సీరియస్..!
రాహుల్ గాంధీ ఆరోపణలు చేసింది.. దొంగ ఓటర్ల గురించి. అలాగే ఆఖరి రౌండ్లలో ఫలితాలు తారుమారు అవుతున్న అంశాలపై. 2024 ఎన్నికల్లో ఇటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లు కనపడలేదు. వైసిపి నమోదు చేయించిన దొంగ ఓటర్లను.. ఎన్నికల సంఘం తొలగించింది. అలాగే ఎన్నికల ఫలితాల రోజు మొదటి రౌండ్ నుంచి కూటమి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆఖరి రౌండ్ లో ఒక దర్శి నియోజకవర్గ మినహా ఎక్కడ కూడా ఫలితాల్లో స్పష్టత రాని పరిస్థితి లేదు. దర్శి నియోజకవర్గంలో కూడా ఆధిపత్యం అటూ ఇటూ మారుతూ వచ్చింది. చివరకు వైసీపీ ఇక్కడ విజయం సాధించింది. రాహుల్ గాంధీ చేసే విమర్శలకు.. రాష్ట్రంలో 2024 ఎన్నికలకు సంబంధం లేని అంశం. అందుకే ఆయన మాట్లాడలేదు అంటున్నారు పరిశీలకులు.