Tuesday, October 28, 2025 05:04 AM
Tuesday, October 28, 2025 05:04 AM
roots

కామెడీ అయిపోతున్న జగన్.. ఎందుకిలా..?

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్ ప్రసంగాలకు మీడియాలో కాస్త హడావుడి ఎక్కువ. ఆయన ఏం మాట్లాడినా సరే దాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి వైసీపీ సోషల్ మీడియా తీవ్రంగా కష్టపడుతూ ఉంటుంది. ప్రత్యర్థులను టార్గెట్ చేసే విషయంలో జగన్ కాస్త ఘాటుగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. నేటి తరానికి అర్థమయ్యేలా సూటిగా చెప్పడంలో జగన్ కాస్త స్పెషలిస్ట్ అనే చెప్పాలి. 2019లో జగన్ అధికారంలోకి రావడానికి ఆ ప్రసంగాలు బాగా కలిసి వచ్చాయి అనే విషయం తెలిసిందే.

Also Read : అమరావతి రైతులపై దాడి చేయమన్నాడు.. బాంబు పేల్చిన కోటంరెడ్డి

అయితే ఇప్పుడు అవే ప్రసంగాలు జగన్ కు ఆయన రాజకీయ పార్టీకి పెద్ద మైనస్ గా మారుతున్నాయి. 2019లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగన్ మాట్లాడిన చాలా మాటల్లో తప్పులు స్పష్టంగా ఉండేవి. దీనితో కూటమి పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియాలో వాటిని పెద్ద ఎత్తున ట్రోల్ చేసేవారు. ఇక అధికారం కోల్పోయిన తర్వాత కూడా జగన్ ఇవే తప్పులు పదేపదే చేస్తూ వస్తున్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడే సమయంలో అలాగే రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే విషయంలో జగన్ దూకుడుగా మాట్లాడుతున్న సరే వాటిల్లో పెద్ద ఎత్తున తప్పులు ఉంటున్నాయి.

Also Read : తెలంగాణలో బాబు, పవన్ ఎంట్రీ.. లైన్ క్లియర్

ఇటీవల తెనాలి పర్యటనలో జగన్ చేసిన కొన్ని కామెంట్స్ కామెడీ అయ్యాయి. మంగళగిరి వాళ్ళను తెనాలి తీసుకెళ్లి కొట్టారని.. తెనాలి వెళ్లి జగన్ వాళ్ళని పరామర్శించి అక్కడే మీడియాతో మాట్లాడుతూ ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇప్పుడు ప్రకాశం జిల్లా పర్యటనలో.. పొగాకు గురించి మాట్లాడుతూ కేజీ రూ. 36000 అంటూ మాట్లాడారు. వెనుకున్న వైవి సుబ్బారెడ్డి కింటా అని చెప్తున్నా సరే జగన్ మాత్రం కేజీ అంటూ మాట్లాడారు. దీనిని పెద్ద ఎత్తున కూటమి పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ జగన్ పై సెటైర్లు వేస్తున్నారు. ఇక జగన్ పర్యటన ఆసంతం అక్కడ వైసిపి కార్యకర్తలు చేసిన హడావుడిపై విమర్శలు వస్తున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్