Saturday, September 13, 2025 06:47 AM
Saturday, September 13, 2025 06:47 AM
roots

కాంగ్రెస్ కి దగ్గరవుతున్న జగన్ రెడ్డి.. సోనియాతో కీలక భేటీ

ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్… పార్టీని మళ్ళీ బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీని కేంద్రంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో ఉన్న టీడీపీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని భావిస్తున్న జగన్, ఇప్పుడు ఎలా అయినా సరే పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నాలను గట్టిగానే చేస్తున్నారు. నల్ల కండువాలతో సోమవారం అసెంబ్లీ సమావేశాలకు జగన్ తన శాసన సభ్యులతో కలిసి హాజరు అయ్యారు. ఇక ఇప్పుడు జాతీయ స్థాయిలో తనకి మద్దతు కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఈ నేపధ్యంలోనే జగన్ మోహన్ రెడ్డి కేంద్ర కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇటీవల ఆయన పార్టీని విలీనం చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే అది నిజం కాదని తెలిసింది. జగన్ కాంగ్రెస్ తో దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేసే క్రమంలోనే బెంగళూరు వెళ్లి అక్కడి ప్రభుత్వ పెద్దలతో సమావేశం అయ్యారనే వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. అయితే పార్టీని విలీనం చేయడం కాదు ఇండియా కూటమికి మద్దతు ఇస్తేనే మంచిది అనే ఆలోచనలోనే జగన్ ఉన్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

ఇండియా కూటమిలో చేరితే రాష్ట్రంలో పార్టీ బలపడే అవకాశం ఉండటంతో పాటు టీడీపీని ఎదుర్కోవడానికి ఆయనకు ఒక వేదిక దొరికే అవకాశం ఉంటుంది. ఇక ఢిల్లీలో ధర్నా చేసేందుకు సిద్దమైన జగన్… పలు పార్టీలకు ఫోన్ చేసి, తమ ధర్నాకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్డియే లో ఉన్న పార్టీలు మాత్రం వచ్చే అవకాశం లేదని స్పష్టంగా చెప్తున్నాయి. ఇక ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు కూడా ఇదే తరహాలో సమాధానం ఇస్తున్నాయని అంటున్నారు. బిజెపితో దూరమైన తర్వాతనే తాము అండగా నిలుస్తామని వారు చెప్పినట్టుగా సమాచారం.

లాబియింగ్ లో ఆరి తీరిపోయిన విజయసాయి రెడ్డి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకి పుట్టిన రోజు చెప్పారు. ఇక కాంగ్రెస్ లో ఉన్న కొందరు నేతలు… జగన్ తో స్నేహం చేసేందుకు సిద్దమవుతున్నారు. నిన్న కాంగ్రెస్ సీనియర్ నేత, జయరాం రమేష్ స్పెషల్ స్టేటస్ విషయంలో, వైసీపీని పొగుడుతూ ట్వీట్ చేయడం ఆసక్తిని రేపింది. ఢిల్లీ పర్యటనలో సోనియా గాంధీతో జగన్ భేటీ అయ్యే అవకాశం ఉందని ప్రియాంకా గాంధీని కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే తెలంగాణాలో రేవంత్ రెడ్డి నుంచి మాత్రం జగన్ తో స్నేహం వద్దనే సంకేతాలు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మరి ఎవరి ప్రయత్నాలు ఎంత ఫలిస్తాయో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్