వైసీపీ అధినేత వైయస్ జగన్ పార్టీ బలోపేతం పై దృష్టి సారించారు. గత కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనని జగన్ అనంతపురం పర్యటన తర్వాత కాస్త దూకుడు పెంచారు. పార్టీలో కొంతమంది కీలక నేతలు సైలెంట్ గా ఉండటంతో పార్టీ కార్యకర్తలు కూడా పెద్దగా బయటకు రావడానికి ఆసక్తి చూపించడం లేదు. దానికి తోడు సోషల్ మీడియా సైలెంట్ గా ఉంటుంది. ప్రజల్లోకి ప్రభుత్వ వ్యతిరేకతను బలంగా తీసుకువెళ్లడానికి గతంలో వైసిపి సోషల్ మీడియాను పెద్ద ఎత్తున వాడుకుంది.
Also Read : వైసీపీలో దర్శకత్వ సమస్య.. జగన్ డైరెక్టర్ ఎవరో..?
ఇప్పుడు పరిస్థితి కాస్త భిన్నంగా ఉండటంతో జగన్ నేరుగా రంగంలోకి దిగాలని భావిస్తున్నారు. దానికి తోడు విజయసాయిరెడ్డి దెబ్బ కూడా పార్టీపై గట్టిగా పడే సంకేతాలు కనబడుతున్నాయి. దీనితో వరుసగా పార్టీ సమావేశాలు నిర్వహించేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. ఈనెల 22 23 తేదీల్లో జగన్ పార్టీ కీలక నేతలతో పాటుగా సోషల్ మీడియా కార్యకర్తలతో కూడా సమావేశం అయ్యేందుకు సిద్ధమయ్యారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీతో 22వ తారీఖున భేటీ అవుతున్న జగన్ 23వ తేదీన సోషల్ మీడియా కార్యకర్తలతో నేరుగా మాట్లాడనున్నారు.
Also Read : ఎంపీ పదవి ఆయనకే.. కూటమిలో క్లారిటీ..!
తాడేపల్లి నివాసంలో ఈ సమావేశాలు జరగనున్నాయి ఇక రాష్ట్రవ్యాప్తంగా కొంతమంది కీలక నేతలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనక పోవడంతో ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లోకి వెళ్లడం లేదు. దానికి తోడు కేసులు భయంతో చాలామంది నాయకులు బయటకు రావడం లేదు. వీటన్నింటినీ గమనిస్తున్న జగన్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని.. గతంలో మాదిరిగా ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని వేగవంతం చేయాలని జగన్ లక్ష్యంగా పెట్టుకుని అడుగులు వేస్తున్నారు. ఎమ్మెల్యేలతో కూడా త్వరలోనే జగన్ సమావేశం కానున్నారు. పలు నియోజకవర్గాలకు ఇన్చార్జిలను కూడా మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి.




