Saturday, September 13, 2025 01:22 AM
Saturday, September 13, 2025 01:22 AM
roots

జగన్ కొత్త ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. సుపరిపాలన కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహించారు. ఇచ్చిన హామీలు అమలు చేసేశామని సీఎం చంద్రబాబు కూడా స్వయంగా చెబుతున్నారు. ఇక ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన వైసీపీ మాత్రం కనీసం అసెంబ్లీకి కూడా రావటం లేదు. అదేమంటే.. 11 స్థానాలు వచ్చిన సరే.. తమని ప్రతిపక్షంగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. అది సాధ్యం కాదని స్పీకర్ తేల్చిచెప్పడంతో ప్రతిపక్షనేతగా గుర్తించాలని.. అప్పటి వరకు సభకు వచ్చేది లేదని మారాం చేస్తున్నారు జగన్. అయితే ప్రజల్లో తమకు చెడ్డ పేరు వస్తుందనే భయంతో ఏడాది తర్వాత పరామర్శల పేరుతో జిల్లాల్లో పర్యటిస్తున్నారు జగన్. అయితే ఈ పర్యటనల సమయంలో ఆయనపై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో క్యాడర్ కూడా కాస్త వెనుకడుగు వేస్తోంది.

Also Read : ఇరాన్ కు భయపడ్డ అమెరికా.. అందుకే సీజ్ ఫైర్..?

వై నాట్ 175 అని.. సిద్ధం అని ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ… కేవలం 11 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఇందుకు ప్రధాన కారణం మాజీ సీఎం జగన్ అనుసరించిన విధానమే. దీంతో ఎన్నికల తర్వాత ముఖ్య నేతలు సైలెంట్‌గా వైసీపీకీ గుడ్ బై చెప్పేశారు. చివరికి అత్యంత ఆప్తుడు, అక్రమాస్తుల కేసులో ఏ2 విజయసాయిరెడ్డి కూడా నీకూ దండం సామి అని చెప్పేశారు. ఇక జగన్ కూడా ఏపీలో కంటే.. ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నారు. యలహంక ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్‌కు అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారు. దీంతో వైసీపీ ప్రస్తుతం చుక్కాని లేని నావ మాదిరిగా తయారైంది. ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయకపోతే కష్టమనే మాట సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే జగన్‌కు సూచించారు.

Also Read : అమిత్ షాపై సంచలన వ్యాఖ్యలు.. వివాదంగా మారిన పదం..!

ఇక తప్పని పరిస్థితుల్లో వైసీపీ ముఖ్య నేతలు, అసెంబ్లీ నియోజకవర్గాల వైసీపీ సమన్వయకర్తలు, పది మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం ఏర్పాటు చేశారు. భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. అదే సమయంలో నియోజకవర్గాల్లో నేతల పనితీరుపై కూడా సమీక్ష నిర్వహించనున్నారు. ఏడాది కాలంలో వైసీపీ నేతలపై కేసులు, అరెస్టుల పైనే ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ముఖ్య నేతలు, మాజీ మంత్రులపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. త్వరలోనే మరి కొందరిని అరెస్టు చేస్తారనే మాట బలంగా వినిపిస్తోంది. దీంతో నేతల్లో ఉన్న భయాన్ని పొగొట్టేలా జగన్ కీలక సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. మాజీ మంత్రులు సైతం.. వారి నియోజకవర్గాల్లో బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. పార్టీ సూచించిన కార్యక్రమాల్లో కూడా కొందరు నేతలు పాల్గొనటం లేదు. దీని వల్ల పార్టీపైన ప్రజల్లో నమ్మకం పోతోందనే భయం పట్టుకుంది. అందుకే నియోజకవర్గాల్లో ప్రజాసమస్యలపై పోరాటం చేయాలని జగన్ సీరియస్‌గా కసరత్తు చేస్తున్నారు. మరి ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్