Tuesday, October 28, 2025 06:58 AM
Tuesday, October 28, 2025 06:58 AM
roots

పులివెందులలో ముదురుతున్న కుటుంబ పోరు.. ఆందోళనలో జగన్

వైఎస్ కుటుంబం అంటే పులివెందుల… పులివెందుల అంటే వైఎస్ కుటుంబం… ఇందులో ఏ సందేహం అవసరం లేదు. రాజకీయంగా ఆ కుటుంబానికి అక్కడ చాలా బలమైన వర్గం ఉంది. ప్రజల్లో పెద్ద ఎత్తున మద్దతు ఉంది. పులివెందులలో ఆ కుటుంబం చెప్పిందే వేదం. కాని ఇక్కడ ఒక షరతు ఉంది… వైఎస్ రాజారెడ్డి కుటుంబానికి మాత్రమే ఇక్కడ అభిమానులు ఉంటారు. వైఎస్ కుటుంబంలో ఇంకో వర్గం ఉంది. వాళ్లకు ఇక్కడ ముందు నుంచి ప్రాధాన్యత లేదు. కానీ 2014 తర్వాత వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి వర్గం పెరిగింది.

ఇది ఇప్పుడు తీవ్రమై… అసలు వైఎస్ అభిమానులు కనుమరుగు అయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే నిజమైన వైఎస్ అభిమానులు అందరూ షర్మిలకు మద్దతు ఇచ్చేందుకు సిద్దమవుతున్నారనే ఓ వార్త పులివెందులలో చక్కర్లు కొడుతోంది. వీళ్ళు అందరూ హైదరాబాద్ లో ఉంటున్న వైఎస్ విజయమ్మను కలిసేందుకు కొన్ని రోజులుగా కొందరు చొప్పున వెళ్లి వస్తున్నారు. నియోజకవర్గంలో మాకు అన్యాయం జరుగుతుందనే విషయాన్ని ఆమె ముందు ప్రస్తావిస్తున్నారు. ఇక విజయమ్మ ఇక్కడ… జగన్ చూసుకుంటారనే మాట చెప్పడం లేదు.

Also Read : ఐపిఎస్ కు గురి పెట్టిన బాబు సర్కార్… సునీల్ కుమార్ కు సెట్ చేసారా…?

పాప చూసుకుంటుంది అని చెప్పడం మొదలుపెట్టారు. ఎవరు వెళ్ళినా సరే షర్మిలకు అండగా నిలబడాలి, వచ్చే ఎన్నికల్లో షర్మిలమ్మ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్ధి అని చెప్తున్నారట. ఇక అవినాష్ రెడ్డి నుంచి ఇబ్బంది పడే వాళ్ళు అందరూ కాంగ్రెస్ లోకి రావాలని జోలపాడటం మొదలుపెట్టారు విజయమ్మ. జగన్ పై కోపంతో ఉన్న షర్మిల, విజయమ్మ… ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు సిద్దమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కొత్త సమీకరణాలు ఉంటాయని, షర్మిలకు అండగా నిలబడితే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని వారికి విజయమ్మ హామీ ఇవ్వడం అక్కడ హాట్ టాపిక్ అవుతోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్