Friday, September 12, 2025 02:59 PM
Friday, September 12, 2025 02:59 PM
roots

మాకు ఈ పెళ్లిళ్లు వద్దు బాబోయ్..!

మాకు ఈ పెళ్లిళ్లు వద్దు బాబోయ్.. పెళ్లిపై యువత ఫీలింగ్ ఇదే. ముఖ్యంగా అబ్బాయిలు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. సోలో బతుకే సో బెటర్ అంటున్నారు యువత. ఇందుకు ప్రధాన కారణం.. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరిణామాలు. కుటుంబంలో కలహాలు సర్వ సాధారణం. కానీ.. అవి ఇప్పుడు ప్రాణాల మీదకు తీసుకువస్తున్నాయి. కొంతమంది పరిస్థితి అయితే.. పెళ్లి చేసుకున్నామనే ఆనందం మూడ్నాళ్ల ముచ్చటగా మారిపోతోంది. పెళ్లి చేసుకుంటే.. ఎక్కడ తమ బతుకులు తెల్లారి పోతాయో అని అబ్బాయిలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారనేది ఓ సర్వే సంస్థ నివేదిక. అబ్బాయిలు నిజంగానే భయపడుతున్నారా.. వారి భయానికి కారణాలేమిటి..

Also Read : ఆపరేషన్ దుబాయ్.. లిక్కర్ కేసులో కీలక అడుగు..!

ప్రస్తుత యువత పెళ్లి చేసుకునే ముందు కొన్ని కండిషన్లు పెట్టుకుంటున్నారు. అందులో ప్రధానమైనది సెటిల్‌మెంట్. జీవితంలో సెటిల్ అయిన తర్వాతే పెళ్లి చేసుకుంటామనేది అబ్బాయిలు, అమ్మాయిల మాట కూడా. దీంతో అబ్బాయిలకు 30, అమ్మాయిలకు 25 ఏళ్లు దాటిపోతున్నాయి. మరీ ముఖ్యంగా అమ్మాయిలు ఎవరో తెలియని వ్యక్తితో కష్టపడటం ఇష్టం లేక పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదంట. ప్రస్తుతం చాలా మంది అమ్మాయిలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాకు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఒక రకంగా అబ్బాయిల్లో భయానికి ఇదీ ఓ కారణమే.. ఇంకా చెప్పాలంటే.. ఇదే ప్రధాన కారణం కూడా అనేది సర్వే సంస్థ రిపోర్టు.

ఇటీవల భార్య చేతిలో బలవుతున్న భర్తలనే వార్తలో బాగా వినిపిస్తున్నాయి. గతంలో కాళ్ల పారణి తడి ఆరకముందే నవ వధువు మృతి, భార్యపై అత్తింటి వారి చిత్రహింసలు అనే వార్తలు చూసి ఇలా చేయడం దారుణం అన్నారు. కానీ ఇప్పుడు భార్య చేతిలో మరో మొగుడు బలి అనే వార్త సర్వసాధారణమైంది. భర్తలను చంపేస్తున్న భార్యలు.. ఇదే ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ చూసినా ఇవే వార్తలు. ఇందుకు ప్రధాన కారణం.. ఆర్థిక సమస్యలు, వివాహేతర సంబంధాలు, తల్లిదండ్రుల ప్రొద్బలం, గొడవల కారణంగా దారుణాలు జరుగుతున్నాయనే మాట వినిపిస్తోంది.

Also Read : సాయి సుదర్శన్ పై ఇంగ్లీష్ ఫ్యాన్స్ ఓవరాక్షన్

ప్రేమించిన ప్రియుడిని మర్చిపోలేక, కట్టుకున్న భర్తతో కాపురం చేయలేక.. ఇలా హత్యలు చేస్తున్న వాళ్లే ఎక్కువగా ఉన్నారు. గూగుల్‌లో భర్తను హత్య చేసిన భార్య అని టైప్ చేస్తే చాలు.. నెల రోజుల్లోనే ఏకంగా 70 హత్యలు జరిగినట్లు వచ్చేస్తోంది. వీటిల్లో 50కి పైగా కేసులు వివాహేతర సంబంధం వల్లే ఉన్నాయి. అంటే సగటున రోజుకు ఇద్దరు భర్తలు తమ భార్యల చేతుల్లో హత్యకు గురవుతున్నారు. కొందరు మహిళలు పెళ్లైన నెల రోజులకే ప్రియుడితో పారిపోతుంటే… మరికొందరైతే.. భర్తను ఎలా హత్య చేయాలనే విషయం ప్రియుడితో పెళ్లికి ముందే ప్లాన్ చేస్తున్నారు. దీంతో పెళ్లి కాని యువకులు.. పెళ్లంటే.. బాబోయ్.. అని పారిపోతున్నారు.

మధ్యప్రదేశ్‌కు చెందిన యువ జంట మేఘాలయకు హనీమూన్‌ వెళ్లింది. అక్కడ భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేసి… దానిని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా రేపింది. అదే తరహాలో తెలంగాణలో ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్‌ను సుపారీ ఇచ్చి మరీ ప్రియుడితో కలిసి హత్య చేసింది భార్య సహస్ర. ప్రియుడితో మాట్లాడొద్దు అని చెప్పిన తండ్రి మీద కోపంతో.. హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి.. తల్లి, ప్రియుడితో కలిసి తండ్రిని హత్య చేసి చెరువులో పడేసి.. సెకండ్ షో సినిమాకు వెళ్లింది.

Also Read : సోషల్ మీడియాలో ఉగ్రవాదులు.. ఎలా దొరికారంటే..?

కలిసి బతకలేం అనుకున్నప్పుడు విడిపోవాలేగానీ ప్రాణాలు తీయడమేంటి?.. అలిగి పుట్టింటికెళ్లిన భార్యను తీసుకొచ్చేందుకు వెళ్లిన భర్త శవమై ఇంటికి తిరిగొచ్చాడు. మాట్లాడుకుందామని పిలిచి భార్య తరపు బంధువులు కొట్టిచంపేశారు. అంతేకాదు డెడ్ బాడీని డోర్ డెలివరీ చేశారు. ఈ దారుణం నంద్యాల జిల్లా నూనెపల్లెలో చోటు చేసుకుంది. భర్తపై అలిగిన భార్య పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే రాజీ చేసుకుందామన్న భార్య బంధువుల మాటలను నమ్మిన భర్త.. నమ్మకంతో పిడుగురాళ్ల వెళ్లాడు. అక్కడ భార్య తరఫు బంధువులు దాడి చేసి హత్య చేశారు. పిడుగురాళ్ల మంచి ఆటోలో 270 కిలోమీటర్ల దూరంలోని నంద్యాల జిల్లా నూనెపల్లికి తీసుకువచ్చి.. భర్త ఇంటి ముందు వదిలేశారు.

బిహార్‌లోని గయాలో భర్తతో గొడవ పడిన భార్య.. అతడి నాలుకను కొరికి మింగేసింది. నాలుక కొరకడంతో అధిక రక్తస్రావం అయ్యింది. దీంతో అతని బంధువులు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఆసుపత్రిలో కూడా భర్తతో గొడవ పెట్టుకున్న భార్య.. అందరి సమక్షంలోనే అతనిపై దాడికి చేసింది. దీంతో భర్త ఆసుపత్రిలోనే మృతి చెందాడు. పడక సుఖం ఇవ్వలేదని, శారీరకంగా తనను సంతృప్తిపర్చడం లేదన్న అసహనంతో భార్యలు తమ భర్తలను హత్య చేస్తున్నారు. పైగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యలు చేసుకున్నట్లు, రోడ్డు ప్రమాదంగా కూడా చిత్రీకరిస్తున్నారు మహిళలు. ఈ అరాచకాలు మితీమీరి పోవడంతో.. మాకు ఈ పెళ్లిళ్లు వద్దు బాబోయ్ అంటున్నారు నేటి యువత.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్