Wednesday, October 22, 2025 06:27 PM
Wednesday, October 22, 2025 06:27 PM
roots

డీఎంకే నేతలతో కలిసి వైసీపీ కల్తీ వ్యాపారం..?

ఆంధ్రప్రదేశ్ కల్తీ మధ్య వ్యవహారానికి, తమిళనాడు కల్తీ మద్యం వ్యాపారాలకు లింక్ ఉందనే వార్తలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. 2024లో తమిళనాడులో 47 మంది కల్తీ మద్యం కారణంగా ప్రాణాలు కోల్పోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. దీనిపై అక్కడి ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశాయి. ఇక 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైసిపి.. కల్తీ మద్యం తయారీని అన్ని రకాలుగా ప్రోత్సహించింది అనే వ్యాఖ్యలు సైతం వినిపించాయి. దీనిపై రాజకీయంగా కూడా పెద్ద దుమారమే రేగింది.

Also Read : ఆ పదవులు ఎప్పుడు భర్తీ చేస్తారో..?

అప్పట్లో మంత్రులుగా ఉన్న కొంతమంది రాయలసీమ నాయకులపై ఈ విషయంలో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఇదే సమయంలో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో పెద్ద ఎత్తున కల్తీ మద్యం తయారుచేసి ఆయా రాష్ట్రాలకు ఎగుమతి చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇక తాజాగా బయటపడిన కల్తీ మద్యం వ్యవహారంలో తెలంగాణకు కూడా ఎగుమతి చేసినట్లు గుర్తించారు. ముఖ్యంగా తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు పెద్ద ఎత్తున వైసీపీ నేతలు కల్తీ మద్యాన్ని ఎగుమతి చేసినట్లు సమాచారం. అధికారంలో ఉన్న డిఎంకె నాయకులతో కలిసి వైసిపి నేతలు కల్తీ మద్యం వ్యాపారం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Also Read : వాళ్ళను వదలొద్దు.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

సాధారణంగా తమిళనాడులో మద్యం విక్రయాలు కాస్త తక్కువగానే ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ షాపుల నిర్వహణ కూడా తక్కువే. అయితే అక్కడి నాయకులతో కలిసి వైసిపి నాయకులు ఆంధ్ర, తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న గ్రామాల్లో పెద్ద ఎత్తున కల్తీ మద్యాన్ని విక్రయించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక తమిళనాడులో ఉన్న కొన్ని బార్లకు కూడా కల్తి మద్యం సరఫరా చేసినట్లు భావిస్తున్నారు. దీనిపై ములకలచెరువులో దొరికిన నిందితులను విచారిస్తే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని తెలుస్తోంది. కల్తీ మద్యం విషయంలో ప్రభుత్వం కూడా దూకుడుగా ఉండటంతో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

నా తండ్రికి ఆమె...

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక రోజు...

బ్రేకింగ్: డీఎస్పీకి అండగా...

తెలుగు రాష్ట్రాల్లో జూదం, కోడి పందాలు...

ఎమ్మెల్యే బావమరిదిని కంట్రోల్...

రాజకీయ నాయకుల అవినీతి వ్యవహారాల విషయంలో...

జోగి రమేష్ సంగతేంటి..?...

ఆంధ్రప్రదేశ్ కల్తీ మద్యం కేసు వెనకడుగు...

పర్యటన తెచ్చిన తంటాలు..!

ఒక పర్యటన ఇప్పుడు సిక్కోలు జిల్లా...

శ్రీలేఖకు టీడీపీ క్యాడర్...

రాజకీయాల్లో ప్రభుత్వ అధికారుల పాత్ర కాస్త...

పోల్స్