గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జనసేన అధినేత ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను పదేపదే వైసిపి టార్గెట్ చేస్తూ ఉండేది. ముఖ్యంగా వైయస్ జగన్ అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను అనే విషయం కూడా మర్చిపోయి పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా విమర్శించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. రాజకీయంగా మాట్లాడటం మానేసి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్. ఇక ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోయింది. పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో ఉన్నారు.
Also Read: కూటమిలో ఎమ్మెల్సీ ఎన్నికల భయం..!
దీనితో వైసిపిని చీల్చి చెండాడుతున్నారు పవన్ కళ్యాణ్. తాజాగా శాసనసభ సమావేశాల్లో జనసేన ను టార్గెట్ చేస్తూ వైసీపీ విమర్శలు చేయడంపై పవన్ కళ్యాణ్ అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కూటమి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఎంతో బాధ్యతగా వ్యవహరించారని.. తమ తప్పు లేకపోయినా గవర్నర్ ప్రసంగం సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై క్షమాపణలు కూడా చెప్తున్నామని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. సాధారణంగా అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ వైసీపీ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించారు.
Also Read: అధ్యక్ష అంటావా.. ఇంట్లో ఉంటావా..?
పెద్దగా విమర్శించడానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ వైసీపీ చేష్టల కారణంగా పవన్ కళ్యాణ్ మరోసారి అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జనసేన పార్టీని టార్గెట్ చేయడంతో భారీగా నష్టపోయింది. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడంతో ఎటువంటి పరిణామాలు ఉంటాయి అనేది ఆసక్తికరంగా మారింది. అయితే తెలుగుదేశం పార్టీ కంటే పవన్ కళ్యాణ్ కు ఎక్కువ వెయిట్ ఇవ్వాలని వైసీపీ వ్యూహంగా కనపడుతోందనేది రాజకీయ పరిశీలకుల మాట. ఇక వైసీపీ శాసనసభ సమావేశాలకు దూరం కావడంతో మీడియా సమావేశాల్లో వైయస్ జగన్ ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది.




