Friday, September 12, 2025 03:24 PM
Friday, September 12, 2025 03:24 PM
roots

పీవీ సునీల్ కోసం రంగంలోకి దిగారా..?

ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయడం పట్ల సోషల్ మీడియాలో ఓ వర్గం.. ఆయనకు మద్దతుగా చేస్తున్న ప్రచారం ఆసక్తిని కలిగిస్తుంది. పివి సునీల్ కుమార్ దళితుడు కాబట్టే ఆయనను సస్పెండ్ చేశారని.. ఆయన డిజిపి కావడం చంద్రబాబు నాయుడుకు ఇష్టం లేదని, రాష్ట్రం ప్రభుత్వంలో కమ్మ సామాజిక వర్గాధిపత్యం ఉందని.. సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అయితే గతంలో సిఐడి చీఫ్ గా పివి సునీల్ కుమార్ వ్యవహరించిన శైలిపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి.

Also Read : చంద్రబాబుపై జీవీ రెడ్డి వ్యాఖ్యలు.. ఇదేంటి మళ్లీ..!

కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఆయన కావాలనే వేధించారని, కొంతమందిని స్వయంగా టార్గెట్ చేసి వారిని సిఐడితో అరెస్టు చేయించారని.. అప్పట్లో తీవ్రస్థాయిలో ఆరోపణలు వినిపించాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, లాప్టాప్ లు, ఫోన్లు కెమెరాలు సహా వ్యక్తిగత వస్తువులను కూడా లాక్కుని వారిని భయభ్రాంతులకు గురి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తెలంగాణలో ఉన్న టిడిపి కార్యకర్తలు కూడా ఆయన.. వేధించి వారిపై పదేపదే సిఐడి పోలీసులను ప్రయోగించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే ఎంపీగా ఉన్న రఘురామకృష్ణం రాజును కస్టోడియల్ టార్చర్ చేసిన వ్యవహారంలో కూడా పీవీ సునీల్ కుమార్ కీలక పాత్ర పోషించారు.

Also Read : జగన్ పై నమ్మకం లేదా…? సీరియస్ గా తీసుకోని లీడర్లు

అలాగే ఆయన రాష్ట్ర ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. విదేశాలకు అనుమతి లేకుండా వెళ్లారని పీవీల్ కుమార్ పై ఆరోపణలు రుజువు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇక సునీల్ కుమార్ తప్పులు చేసినట్టు సాక్ష్యాలు ఉన్నా.. కొంతమంది సామాజిక వర్గం పేరుతో ఆయనకు మద్దతిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గతంలో కమ్మ సామాజిక వర్గ ఐపీఎస్ అధికారులను వైయస్ జగన్ ప్రభుత్వంలో వేధించిన సమయంలో చాలామంది విశ్లేషకులు సైలెంట్ గానే ఉండిపోయారు. ఇప్పుడు వాళ్ళందరూ పివి సునీల్ కుమార్ కు మద్దతుగా బయటకు వచ్చి మాట్లాడటం గమనార్హం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్