15 రోజులపాటు జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. 15 రోజుల్లో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు కౌన్సిల్లో అలాగే అసెంబ్లీలో మంత్రులు సమాధానాలు ఇచ్చారు. పలు కీలక శాఖలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రతి మంత్రి దాదాపుగా సమాధానం ఇచ్చారు. అయితే సమావేశాలకు వైసీపీ రాకపోవడంతో ప్రశ్నలు వినడం గానీ వాటిపై ఎదురు ప్రశ్నించే అవకాశం గాని లేదంటే విమర్శించే అవకాశం గానీ వైసీపీకి లేకుండా పోయింది. దీనిపై వైసీపీ సోషల్ మీడియా ఆ పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతోంది. ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టడంలో ప్రశ్నోత్తరాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి.
Also Read :వైసీపీలో ఫుల్ స్క్రాప్.. జగన్‌కు సినిమా..!
హోం శాఖ నుంచి ఆర్థిక శాఖ పరిశ్రమలు ఇలా ప్రతి శాఖపై వైసీపీ సభ్యులు ప్రశ్నలు అడిగారు. కీలకమైన పెన్షన్ల అంశంలో కూడా వైసీపీ సభ్యులు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగానే పలు ప్రశ్నలు వేశారు. కానీ వాటిపై మీడియా సమావేశాల్లో గాని అసెంబ్లీలో గాని ఎక్కడా కూడా కౌంటర్లు ఇవ్వలేదు. మండలి సంగతి పక్కన పెడితే అసెంబ్లీలో.. వైసీపీ సభ్యులు లేకపోవడంతో విమర్శలకు ప్రతి విమర్శలకు అవకాశం లేకుండా పోయింది. దీనిపై వైసీపీ సోషల్ మీడియా తమ పార్టీ అధినేత పై విమర్శలు గుప్పిస్తోంది.
Also Read :ఇంకులేని పెన్ను.. తాటిపర్తికి స్ట్రాంగ్ కౌంటర్..!
జగన్ వెళ్ళకపోయినా ఎమ్మెల్యేలను సభకు పంపి ఉంటే బాగుండేది అని పలువురు అభిప్రాయపడుతున్నారు. కనీసం మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని విమర్శించి ఉంటే బాగుండేది అనే అభిప్రాయం కూడా ఆ పార్టీ కార్యకర్తల్లో వ్యక్తం అవుతుంది. అసెంబ్లీ సమావేశాలను వైసీపీ వాడుకోలేకపోయిందని కీలకమైన బడ్జెట్ సమావేశాల విషయంలో కూడా అలసత్వం ఎందుకని.. ఇగో సమస్యలు ఉన్నప్పుడు రాజకీయాలకు పనికిరారు అంటూ కొంతమంది వైసీపీ కార్యకర్తలు కామెంట్ చేస్తున్నారు.