Saturday, September 13, 2025 05:09 AM
Saturday, September 13, 2025 05:09 AM
roots

ఇది కొనసాగితే టిడిపి కి ముప్పు ముంచుకొచ్చినట్లే..!

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం విషయంలో టీడీపీ క్యాడర్ ముందు నుంచి అసహనంగానే సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ మంత్రి వర్గంలా ఉందీ అంటూ పలువురు టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో విమర్శలు చేసారు. ఇప్పుడు కూడా ఆ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కీలక శాఖల పేషీల విషయంలో చాలా మంది అసహనంగా ఉన్నారు. అలాగే కొందరు మంత్రుల పని తీరు విషయంలో అసంతృప్తిగా ఉన్నారు. కార్యకర్తలను పట్టించుకోవడం లేదనే ఆవేదన చాలా మందిలో ఉంది.

ఇక ఇప్పుడు పేషీలలో ఓఎస్డీల రూపంలో కొందరు పాగా వేసారని… ముఖ్యంగా సీనియర్ మంత్రుల పేషీలలో వైసీపీ అనుకూల మీడియాలో పని చేసిన వాళ్ళు… వైసీపీకి సహకరించిన వాళ్ళు చాలా మందే ఉన్నారని కామెంట్స్ వస్తున్నాయి. ఇక మంత్రులు కూడా వాళ్ళ గురించి తెలిసినా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని సమాచారం. టీడీపీ అనుకూల మీడియా నుంచి ఇప్పటికే హెచ్చరికలు వెళ్ళినా… కొందరు దృష్టి పెట్టలేదని కామెంట్స్ వినపడుతున్నాయి. కీలక సమాచారంతో పాటుగా వ్యక్తిగత విషయాలు కూడా బయటకు వెళ్తున్నాయని తెలుస్తోంది.

Also Read : నామినేటెడ్ జాబితా సిద్ధం… ఈసారి వారికే ప్రాధాన్యత…!

దీనికి సంబంధించి ప్రభుత్వ పెద్దలు గాని మంత్రి వర్గంలో అనుభవం ఉన్న వాళ్ళు గాని పట్టించుకోవడం లేదని… మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి సహకరించిన వాళ్ళు ఆరోపిస్తున్నారు. బులుగు చొక్కాల పెత్తనమే సచివాలయంలో నడుస్తోంది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవి వైసీపీకి రాజకీయ అస్త్రాలుగా మారే అవకాశం ఉందని… కాబట్టి కాస్త శ్రద్ధ పెట్టాలని కోరుతున్నారు. ఇప్పటికే వైసీపీ అన్ని విధాలుగా టార్గెట్ చేసేందుకు వ్యూహాలు సిద్దం చేసుకుని నాయకులకు బాధ్యతలు ఇస్తోంది. కాబట్టి ఈ సమయంలో అలెర్ట్ గా లేకపోతే మాత్రం ముప్పు ముంచుకు వచ్చినట్టే అని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్