ఒకప్పుడు వైసీపీ అంటే విజయసాయిరెడ్డి… విజయసాయిరెడ్డి అంటే వైసిపి అన్నట్లుగా వాతావరణం ఉండేది. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీలో కీలక పాత్ర పోషించడం మొదలుపెట్టిన దగ్గర్నుంచి వైసీపీలో విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత భారీగా తగ్గిందనే చెప్పాలి. రాజకీయంగా వైసిపి ప్రస్తుతం బలహీనంగా ఉండటంతో.. విజయసాయిరెడ్డి ఆ పార్టీని ఏదో ఒక రూపంలో ఆదుకునే అవకాశం ఉందని పార్టీ కార్యకర్తలు ఊహించారు.
Also Read : సింపతీ కార్డుతో కామెడి పీస్ అయిన పోసాని…!
కానీ పరిస్థితి పూర్తి భిన్నంగా జరిగింది. విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడమే కాకుండా… రాజకీయాల నుంచి కూడా పూర్తిస్థాయిలో తప్పుకున్నారు. ఇక తాజాగా ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనమయ్యాయి. వైసీపీ నుంచి తాను బయటకు రావడానికి కోటరి ప్రధాన కారణమని విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై వైసీపీ సోషల్ మీడియా ఘాటుగా రియాక్ట్ అవుతుందని చాలామంది ఎదురు చూశారు.
Also Read : రాజమౌళి – మహేష్ ప్రాజెక్ట్ పై బాలీవుడ్ మీడియా ఫోకస్
కానీ పరిస్థితి మాత్రం డిఫరెంట్ గా కనపడింది. విజయ్ సాయి రెడ్డి వ్యాఖ్యలపై వైసీపీ సోషల్ మీడియా సైలెంట్ గా ఉండిపోయింది. కొంతమంది విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. సాధారణంగా జగన్ పై ఎవరైనా విమర్శలు చేస్తే వైసిపి కార్యకర్తలు.. అలాగే ఆ పార్టీ సోషల్ మీడియా ఘాటుగా రియాక్ట్ అవుతూ ఉంటుంది. కానీ విజయసాయిరెడ్డి విషయంలో మాత్రం ఇది పక్కా భిన్నంగా ఉంది అనే చెప్పాలి. అయితే విజయ్ సాయి రెడ్డిని కెలకడం ఇష్టం లేకుండా ఆ పార్టీ నేతలు సైలెంట్ గా ఉన్నారు అనే వ్యాఖ్యలు కూడా వినపడుతున్నాయి. అటు సాక్షి ఛానల్ డిబేట్లో కూడా వైసీపీ నేతలు చాలా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇప్పటికే షర్మిల తో ఇబ్బంది పడుతున్న జగన్.. విజయసాయిరెడ్డి ఏ అడుగు వేసిన సరే పక్కాగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. అందుకే విజయసాయిరెడ్డి విషయంలో సైలెంట్ గా ఉన్నట్టు తెలుస్తోంది.