గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ విషయంలో ఇప్పుడు పోలీసులు పాత కేసులను బయటకు తీస్తున్నారు. గన్నవరం నియోజకవర్గంతో పాటుగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఆయన చేసిన అక్రమాల విషయంలో పోలీసులు గట్టిగానే ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా భూ కబ్జాల విషయంలో వల్లభనేని వంశీ దూకుడుగా ఉన్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. దీనిపై అప్పట్లో వైసీపీ ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరించింది.
Also Read : రెబల్ ఫ్యాన్స్ కు పండుగ లాంటి న్యూస్
ఇక తనకు ఎవరైనా అడ్డం వస్తే వాళ్లను అధికారం అడ్డం పెట్టుకొని… వల్లభనేని వంశీ మోహన్ వేధించినట్లు కూడా అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. ఇక ఇప్పుడు ఈ కేసులను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు పోలీసులు. అయితే ఇక్కడ వల్లభనేని వంశీ మోహన్ విషయంలో కేసులు పెడుతున్నా సరే వైసీపీ అధిష్టానం గానీ, వైసీపీ కార్యకర్తలు గాని వైసీపీ సోషల్ మీడియా గానీ ఎక్కడా వల్లభనేని వంశీ మోహన్ కు మద్దతుగా సోషల్ మీడియాలో మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు.
Also Read : తెలంగాణా ప్రభుత్వ బడ్జెట్ హైలెట్స్ ఇవే
ఎక్కడో ఒకరిద్దరు మినహా పెద్దగా వైసీపీ నేతలు కూడా వంశీ విషయంలో రియాక్ట్ కావడం లేదు. వంశీ తో సన్నిహితంగా ఉన్న మాజీ మంత్రులు నానీలు కూడా పెద్దగా బయటకు రావటం లేదు. వంశీని అరెస్టు చేసిన తర్వాత జగన్ పరామర్శించి వచ్చారు. ఆ తర్వాత వైసీపీ నేతలు అందరూ సైలెంట్ అయిపోయారు. ఇక తమను తాము కాపాడుకునే ప్రయత్నంలో ఉన్న కొడాలి నాని, పేర్ని నానీలు వంశీ విషయంలో సైలెంట్ కావడం గమనార్హం.
Also Read : కుప్పం వైసీపీ కొప్పు ఊడుతుందా…?
అటు వంశీకి న్యాయ సహాయం అందించే విషయంలో కూడా పెద్దగా వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టడం లేదు. మొన్నటి వరకు పొన్నవోలు సుధాకర్ రెడ్డి వంశీకి బెయిల్ పిటిషన్ లపై వాదించారు. ఇప్పుడు పెద్దగా ఆయన జోక్యం చేసుకోవడం లేదు. పోసాని కృష్ణ మురళిని బయటకు తీసుకురావడంపైనే సుధాకర్ రెడ్డి ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు.