రాజకీయాల్లో నోటి దూల అనేది సర్వ సాధారణం. కానీ అధికారంలో లేనప్పుడు నోటిని ఎంత పొదుపుగా వాడితే పార్టీ అంత ఆరోగ్యంగా ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు చూపించిన లక్షణాలు అధికారం కోల్పోయిన తర్వాత కూడా చూపిస్తే పరిస్థితులు తలకిందులు అవుతాయి. ఇది ఖచ్చితంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు సరిగ్గా సరిపోతుంది. జగన్ కు నోటి దురుసు ఎక్కువే. ఇదేమి కొత్తగా చెబుతున్న విషయం కాదు. గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలే ఆయన్ను ఇప్పుడు 11 స్థానాలకు తీసుకొచ్చాయి. ఆ విషయం ఆయనకు క్లారిటీ లేకపోయినా ప్రజలకు చాలా క్లారిటీ ఉంది.
మండలి విషయంలో కూడా జగన్ ఇలాంటి వ్యాఖ్యలే చేసి ఇప్పుడు మండలిలో బలం లేకుండా చేసుకుంటున్నారు అనే విషయం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తే అర్ధమవుతోంది. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లులను అడ్డుకుంటాం, మాకు మండలిలో బలం ఉందన్నారు జగన్. సాధారణంగా పరిస్థితి మనకు అర్ధం కానప్పుడు వ్యూహాలు అమలు చేయాలి తప్పించి వాటి గురించి మాట్లాడకూడదు. కానీ జగన్ మాట్లాడకూడని కొన్ని మాటలు బహిరంగంగా మాట్లాడారు. వాస్తవానికి కొన్ని బిల్లులను ప్రభుత్వం ప్రవేశ పెట్టాల్సి ఉంది. కాని ఏ బిల్ కూడా ప్రవేశ పెట్టట్లేదు. అందుకే మండలిలో బిల్ వెళ్తే అక్కడ ఎలాంటి సమస్య లేకుండా ఒక పద్దతి ప్రకారం రూట్ క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు.
Read Also : చీల్చి పంచుకుంటున్న టిడిపి, జనసేన
వైసీపీకి ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామాలు చేసారు. మరో ఎమ్మెల్సీ సామినేని ఉదయ భాను తో పాటుగా జనసేనలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. త్వరలోనే ఆరుగురు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేయడానికి సిద్దమవుతున్నారు. వాళ్ళు అసలు వైసీపీ ఆఫీస్ దరిదాపుల్లోకి కూడా రావడం లేదు. టీడీపీ గాని, జనసేన గాని పార్టీలోకి తీసుకునే ముందు పదవులకు రాజీనామా చేయాల్సిందే అనే కండీషన్ పెట్టాయి. కేసులు ఉన్న వాళ్ళు భయపడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో వాళ్లకు అర్ధం కాని పరిస్థితి. అందుకే కొందరు సైలెంట్ గా జారుకుంటున్నారు. జగన్ ఆ మాట అన్న తర్వాతి నుంచి టీడీపీ బ్యాక్ గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టింది. రాజ్యసభ సభ్యులతో పాటుగా ఆ ముగ్గురు కూడా వైసీపీకి, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసి అన్నకు గుడ్ బై చెప్పేశారు.