Saturday, September 13, 2025 01:15 AM
Saturday, September 13, 2025 01:15 AM
roots

జాతీయ స్థాయికి వైసీపీ.. సక్సెస్ అవుతుందా..?

కూటమి ప్రభుత్వంలో ఏ చిన్న తప్పు దొరుకుతుందా.. దానిని రచ్చ చేద్దామా అనేది ఇప్పుడు వైసీపీ నేతల ఏకైక లక్ష్యం. అందుకే ప్రతి విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూస్తోంది.. చూపించేందుకు ప్రయత్నం కూడా చేస్తోంది. వినుకొండ హత్య మొదలు.. పొదిలి జగన్ యాత్రలో రాళ్ల దాడి వరకు ప్రతి విషయంలో కూడా రాజకీయమే. అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సాక్షి మీడియా తరఫున జగన్ క్షమాపణ చెప్పాలని పొదిలిలో మహిళలు నల్ల బెలూన్లు ఎగురవేస్తే.. దానికి వైసీపీ నేతలు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో మహిళలతో పాటు పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. అసలు రైతుల పరామర్శకు 15 వేల మంది ఎందుకు అని ప్రశ్నిస్తే.. అభిమానంతో వచ్చారు.. కాదనగలమా… రాకూడదా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. మార్కాపురం నియోజకవర్గం పరిధిలో పర్యటనకు గుంటూరు, నెల్లూరు జిల్లాల నుంచి ఎందుకు మనుషులను తరలించారంటే మాత్రం.. నో ఆన్సర్.

Also Read : తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైన చర్చ..!

సాక్షి మీడియాలో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజును పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ షో నిర్వహించినందుకు సాక్షి యాజమాన్యంపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి కార్యాలయాలపై దాడులు చేశారు. వైఎస్ భారతీ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ కూడా చేశారు. ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారుతుందనే భయంతో.. వైసీపీ మహిళా విభాగం తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయని.. వాటిని అరికట్టడంలో కూటమి సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇక పత్రికా స్వేచ్ఛకు భంగం కలుగుతోందంటూ హైదరాబాద్‌లో సీనియర్ పాత్రికేయుల ముసుగులో వైసీపీ అభిమానులంతా మీటింగ్ పెట్టారు. ఈ రెండు కూడా ఆశించినంత మైలేజ్ తీసుకురాలేదు.

Also Read : పారిపోవడానికి సిద్ధంగా వైసీపీ నేతలు..? చెవిరెడ్డితో స్టార్ట్ అయిందా..?

ఓ వైపు యోగాంధ్ర ప్రదేశ్ పేరుతో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరిపేందుకు ఏపీ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. విశాఖలో 5 లక్షల మందితో నిర్వహించే యోగా కోసం ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారు. ఈ కార్యక్రమంతో ఏపీకి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వస్తుందని కూటమి సర్కార్ పెద్దలు చెబుతున్నారు. ఇదే విషయం వైసీపీ నేతలకు మింగుడు పడటం లేదు. అందుకే ఏ చిన్న కారణం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్న సమయంలో.. కుప్పం ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త చేసిన అప్పు చెల్లించలేదనే కారణంతో భార్యను చెట్టుకు కట్టేసి విచక్షణా రహితంగా కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. కుప్పం నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. బాధితురాలికి అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు. బాధితురాలితో స్వయంగా మాట్లాడి ధైర్యం చెప్పారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Also Read : ఫోన్ ట్యాపింగ్ లో పేలిన బాంబు.. వెయ్యి మంది ఫోన్లు..?

బాధితురాలికి తక్షణ సాయం కింద రూ.5 లక్షలు సాయం అందించారు చంద్రబాబు. వాస్తవానికి ఈ విషయంలో బాధితురాలికి ఇప్పటికే న్యాయం జరిగిందనే చెప్పాలి. అయితే వైసీపీ నేతలు మాత్రం.. దీనిని రాజకీయం చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ ఘటన అమానుషమని.. సీఎం సొంత జిల్లాలోనే మహిళలకు రక్షణ లేదని ఆరోపిస్తున్నారు. చివరికి మహిళ ఫోటలను చాట్ జీపీటీలో గ్రాఫిక్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక వైసీపీ పెద్దలైతే ఈ విషయాన్ని మరింత పెద్దది చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కుప్పంలో అనాగరికం అంటూ సొంత మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్‌కు తిరుపతి ఎంపీ గురుమూర్తి, గుమ్మా తనూజా రాణి ఫిర్యాదు చేశారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే ఆటవిక, అనాగరికంగా వ్యవహరించడం దారుణమని.. మహిళల రక్షణ గాలిలో దీపం మాదిరిగా తయారైందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీలో శాంతిభద్రతలు కరువయ్యాయని.. కుప్పం ఘటన కూటమి ప్రభుత్వానిదే బాధ్యత అని.. చర్యలు తీసుకోవాలని ఎంపీ గురుమూర్తి కోరారు. ఈ సమస్యను జాతీయ స్థాయికి తీసుకెళ్తే.. ఏపీకి వచ్చే గుర్తింపును రాకుండా అడ్డుకోవాలనేది వైసీపీ నేతల కుట్ర అని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్