Tuesday, October 28, 2025 01:42 AM
Tuesday, October 28, 2025 01:42 AM
roots

వైసీపీ కామెడి.. అల్లు అర్జున్ మాత్రమే మనిషా..? 5 ఏళ్ళ పాపాలు మరిచారా..?

హైదరాబాద్ పోలీసులు సినీ నటుడు అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ లో వైసిపి సానుభూతి కురిపించడాన్ని ఇప్పుడు చాలామంది కాస్త కామెడీగా చూస్తున్నారు. రాజకీయంగా వైసిపి బలహీనంగా ఉన్న సమయంలో అల్లు అర్జున్ కు మద్దతు ఇచ్చి ఒక వర్గం ద్వారా మద్దతు పొందాలని తీవ్రస్థాయిలో వైసీపీ అధినేత జగన్ అతి తీవ్రంగా కష్టపడుతున్నారు. అంతవరకు బాగానే ఉంది కానీ అల్లు అర్జున్ అక్రమంగా అరెస్టు చేశారని ఆయన పై రాజకీయ కక్ష సాధింపు జరుగుతుందని, గురువు చెప్పడంతో శిష్యుడు అల్లు అర్జున్ ను జైల్లో పెట్టారు అంటూ సోషల్ మీడియాలో అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో కామెంట్ చేయడం మొదలుపెట్టారు.

Also Read: ఆ మాజీకి చెక్ పెట్టనున్న చంద్రబాబు…!

దీనిపై సాక్షి ఛానల్ లో డిబేట్స్ కూడా నడుస్తున్నాయి. ఇక ఈ సందర్భంగా కొంతమంది సానుభూతి కురిపిస్తూ కన్నీళ్లు కూడా కారుస్తున్నారు. అయితే ఈ కన్నీళ్లు కార్చిన వాళ్ళందరూ గత ఐదేళ్లలో జరిగిన పాపాలపై మాత్రం ఏ ఒక్క వీడియో చేయకపోవడం గమనార్హం. రాయలసీమ వ్యాప్తంగా అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో హ*త్యలు జరిగాయి. డాక్టర్ సుధాకర్ వంటి దళితులను అన్యాయంగా ఇబ్బందిపెట్టినా సరే, అలాగే చంద్రయ్య లాంటి బీసీ వ్యక్తిని పల్నాడులో హతమార్చిన సరే.. పులివెందుల, జమ్మలమడుగు, రాయచోటి వంటి నియోజకవర్గాల్లో పలు హ*త్యలు జరిగినా…

Also Read: పీకే మార్క్ పాలిట్రిక్స్… వర్కవుట్ అవుతాయా….?

అక్రమ కేసులు బనాయించి రాజకీయ ప్రముఖులను జైల్లో పెట్టి నానా హింసలు పెట్టినా, తప్పు చేయని వాళ్లను చేశారని కేసులు బనాయించి వందల కోట్లు జరిమానాలు విధించినా… ఎప్పుడూ కూడా వీళ్ళు ఎవరు బయటకు వచ్చి మాట్లాడలేదు. పోలీసులను అడ్డం పెట్టుకుని డ్రామాలాడుతున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. గత ఐదేళ్లుగా వైసిపి చేసిన కార్యక్రమాలు ఇంకా వీడియోల రూపంలో సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉన్నాయి. రాజధాని కోసం మద్దతిస్తున్న మహిళలను అత్యంత దారుణంగా హింసించిన ఘనత కూడా వైసిపి ప్రభుత్వానికి దక్కుతుంది.

Also Read: అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయగలిగారు.. మరి ఆర్జీవీని..? లోపం ఎక్కడుంది?

నకిలీ పోలీసులను తీసుకొచ్చి రాజధాని మహిళలను అసభ్యకరంగా బూతులు తిట్టించి వారిపై దాడులు కూడా చేయించిన పరిస్థితి ఉంది. కనకదుర్గమ్మ గుడిలో అమ్మవారికి సారే చీర ప్రధానం చేయడానికి వెళ్లే మహిళలపై కూడా అత్యంత దారుణంగా ప్రవర్తించారు కొంతమంది పోలీసులు. అలాగే సినిమా నటులను వైయస్ జగన్ కార్లు బయట పెట్టించి తన ఇంట్లోకి నడిపించిన పరిస్థితి కూడా ఉంది. సినిమా రంగాన్ని గత ఐదేళ్లలో నానా ఇబ్బందులు పెట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి కానీ వాళ్ళు ఎవరు అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడటం కాస్త కామెడీగా ఉందంటూ పరిస్థితులను గమనిస్తున్న పలువురు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్