ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అధికారుల వైఖరి పెద్ద తలనొప్పిగా మారింది. గత ప్రభుత్వంలో అవినీతి, అక్రమాల్లో భాగస్వామ్యం అయిన ఐపిఎస్ లు, ఐఏఎస్ లు కొందరు కోవర్టులుగా పనిచేస్తున్నారన్న వార్తలు రావడం ఒక ఎత్తు అయితే ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలకు సాక్ష్యాలుగా ఉన్న రికార్డులు తగలబెట్టే కార్యక్రమాలు చేయడం మరో ఎత్తు. పెద్దిరెడ్డి నియోజకవర్గంలో మొదలైన ఈ కార్యక్రమం ఇప్పుడు గోదావరి జిల్లాకు కూడా పాకింది. ఉత్తరాంధ్ర లో పలాస నియోజకవర్గంలో కూడా జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు కోవర్ట్ లు ఏపీ సచివాలయంలో కూడా తమ పని తాము చేయకుండా ఇతర కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారనే వార్తలు వస్తున్నాయి.

ఇప్పుడు ప్రభుత్వం… గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి వ్యవహారాల మీద పెద్ద ఎత్తున ఫోకస్ చేసింది. వాటిపై అంతర్గత విచారణ కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే. అన్ని శాఖలు, కార్పోరేషన్ల మీద కూడా ఇదే తరహాలో విచారణ జరుగుతుంది. ఏకంగా అధికారులను అరెస్ట్ చేసే వరకు వెళ్ళింది. నిన్న వాసుదేవరెడ్డిని అదుపులోకి తీసుకుంది టిడిపి సర్కార్. ఆయన ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారో తెలిస్తే ప్రజలు విస్తుపోవడం ఖాయం. ఇదిలా ఉంచితే ఇప్పుడు… ఏపీ సచివాలయంలో జగన్ కోవర్టులు చంద్రబాబుకి తలనొప్పిగా మారారు అనే ఆరోపణలు వినపడుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలను అధికారులు, ప్రజల కంటే ముందే వైసీపీ పెద్దలకి సమాచారం ఇస్తున్నారు అన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.

స్కాం లు, విచారణల పై ఎప్పటికప్పుడు మాజీ ప్రభుత్వ పెద్దలకి లీకులు ఇస్తున్నారు. ఎలాంటి కీలక పరిణామం చోటు చేసుకున్నా కూడా చిటికెలో సమాచారం పంపిస్తున్నారు. వివిధ విభాగాలలోని కీలక స్థానాల్లో కోవర్టులు తిష్ట వేసారని తెలుస్తోంది. మరింత మంది తమ అనుయాయులను వివిధ శాఖల్లోకి పంపే విధంగా జగన్ ప్లాన్ చేయగా వాటిని కొందరు ఉన్నతాధికారులు అమలు చేస్తున్నారని సమాచారం. దీనికి సంబంధించి జగన్ మనుషులు ఒక ప్లాన్ కూడా రెడీ చేసారని అంటున్నారు. దీనికి సంబంధించి కొందరు అధికారులను సాక్ష్యాలతో బయట పెట్టేందుకు కూటమి సర్కార్ సిద్దమవుతోంది. మరి ఈ ఆరోపణలు నిజమేనా, నిజమైతే బాబు సర్కార్ వీరిని ఎలా అదుపుచేయబోతుంది అన్న విషయం ఆసక్తికరంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.




