ఏదో చేయాలని చూస్తే.. ఇంకేదో జరిగిందనేది పాత సామెత.. ఇంకా చెప్పాలంటే.. కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక కూడా ఊడిందనేలా వైసీపీ నేతల తీరు ఉంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుబట్టాలని చూస్తున్న ప్రతిసారి.. తమ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఇరుకున పెడుతున్నారు. ఏ చిన్న విషయం పైన అయినా సరే.. వైసీపీ నేతలు ప్రశ్నించడం.. ఆ తర్వాత వారి వదిలిన బాణాలు అన్ని జగన్ వైపు తిరగడంతో.. మీకో దండం రా నాయనా అని అగ్రనేతలు అంటున్నారు. లేని సమస్యను సృష్టించి ఏదో చేయాలని అనుకుంటున్నారు. కానీ అది అటు తిరిగి.. ఇటు తిరిగి.. మళ్లీ జగన్ పైకే వస్తున్నాయి. తాజాగా పేర్లు మార్పు విషయంలో వైసీపీ నేతలు, అభిమానులు చేసిన హంగామా చివరికి వైఎస్ జగన్ చేసిన తప్పులను ఎత్తి చూపించడంతో అంతా తేలు కుట్టిన దొంగల్లా సైలెంట్ అయిపోయారు.
Also Read : రెబల్ ఫ్యాన్స్ కు పండుగ లాంటి న్యూస్
మంత్రివర్గ సమావేశంలో రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది కూటమి ప్రభుత్వం. ఒకటి తాడిగడప మునిసిపాలిటీ పేరు మార్పు, రెండోది వైఎస్ఆర్ జిల్లాకు కడప అనే అక్షరాలు కలపడం. అంతే.. వెంటనే రంగంలోకి దిగిన వైసీపీ నేతలు.. బాబోయ్… వైఎస్ఆర్ పేరు తొలగించారు.. వైఎస్ఆర్‌ను చంద్రబాబు అవమానించారు.. అంటూ తెగ గోల చేశారు. కడపతో పాటు మిగిలిన జిల్లాలకు కూడా ఆయా ఊర్ల పేర్లు పెట్టాలంటూ కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకువచ్చారు. అలాగే వైఎస్ఆర్ అంటే చంద్రబాబుకు కోపమని.. అందుకే ఇలా పేర్లు తొలగించడం చేస్తున్నారని కూడా విమర్శలు చేశారు. అయితే వీటన్నిటికీ టీడీపీ అభిమానులు ఘాటుగా బదులివ్వడంతో వైసీపీ నేతలు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు.
Also Read : బిల్ గేట్స్ తో బాబు కీలక ఒప్పందాలు
వాస్తవానికి వైఎస్ఆర్ పేరు తొలగించిన వారిలో ముందు వరుసలో ఉన్న వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. 2019 ఎన్నికల ముందు నవరత్నాల పేరుతో ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేశారు. అందులో మధ్యలో వైఎస్ఆర్ ఫోటో పెట్టి.. చుట్టూ పధకాలను ప్రస్తావించారు. అయితే గెలిచిన తర్వాత నెమ్మదిగా వైఎస్ఆర్ బొమ్మ తొలగించారు. అది 2024 నాటికి వచ్చే సరికి వైఎస్ఆర్ స్థానంలో జగన్ ఫోటో మాత్రమే మిగిలింది. ఇలాగే సాక్షి పత్రికలో కూడా గతంలో కొద్ది రోజుల పాటు వైఎస్ ఫోటో తొలగించారు. ఇక సాక్షి టీవీలో అయితే.. పై నుంచి వైఎస్ ఫోటో పైన పూలు కూడా కురిపించారు. ఆ తర్వాత పూలు లేవు.. చివరికి ఫోటో కూడా మాయమైపోయింది. ఇక అధికారంలో ఉన్నప్పుడు కూడా పథకాలకు తండ్రి వైఎస్ఆర్ పేరు బదులుగా.. తన పేరే ఎక్కువగా పెట్టుకున్నాడు జగన్. 2019 ఎన్నికలప్పుడు ఏమో.. రాజన్న రాజ్యం అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పిన జగన్.. 2024 నాటికి వచ్చే సరికి.. మీ బిడ్డ.. మీ జగన్.. అంటూ రాజన్నను పక్కన పెట్టేశారు.
Also Read : అప్పుడు అలా అన్నారు.. మరి ఇప్పుడేమంటారు..?
ఇక పేర్ల తొలగింపు విషయంలో కూడా ఎవరైనా సరే జగన్ తర్వాతే అంటూ సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించిన విషయం మర్చిపోయారా అంటూ వైసీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు. అలాగే విశాఖ బిచ్‌లో మాజీ రాష్ట్రపతి డా.అబ్దుల్ కలాం పేరు తొలగింపు, ప్రభుత్వ పథకాలకు కూడా మహనీయుల పేర్లకు బదులుగా అన్నిటికీ జగన్ పేర్లు పెట్టుకున్న విషయం గుర్తు లేదా అని నిలదీస్తున్నారు. అసలు పేర్ల తొలగింపును మొదలు పెట్టిందే జగన్ కాదా అని నిలదీస్తున్నారు. దీంతో ఏదో ఒకవేలు కూటమి సర్కార్ వైపు చూపిస్తే.. మిగిలిన నాలుగు వేళ్లు కూడా జగన్ వైపు చూపిస్తున్నాయని గుర్తించిన వైసీపీ నేతలు.. ఇప్పుడు తేలు కుట్టిన దొంగల్లా సైలెంట్ అయ్యారు.