సాధారణంగా వైసీపీ విషయంలో ఓ విమర్శ ఎక్కువగా వినపడుతూ ఉంటుంది. విధ్వంసానికి ఆ పార్టీ మారుపేరు అనేది ప్రధాన ఆరోపణ. వైసిపి అధికారంలో ఉన్న లేకపోయినా సరే.. ఆ పార్టీ నాయకులు అదే ధోరణిలో వెళుతూ ఉంటారు. 2014 నుంచి 2019 వరకు ఎన్నో విధ్వంస కార్యక్రమాలను వైసీపీ అప్పట్లో నిర్వహించి నిరసన రూపంలో వాటిని ప్రజల ముందు ఉంచింది. కనపడకుండా కూడా కొన్ని కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వేదికను కూల్చివేస్తూ అప్పట్లో వైయస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు.
Also Read : మాజీ క్రికెటర్ కు బీజేపీ గాలం.. ఈసారి వర్కౌట్ అవుతుందా..?
ఈ నిర్ణయం పై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇక అమరావతి విషయంలో కూడా వైసిపి అదే వ్యవహార శైలి ప్రదర్శించింది. ఇక ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా వైసిపి నాయకులు ఆ పార్టీ కార్యకర్తలు అదే ధోరణిలో ముందుకు వెళ్తున్నారు. ఇటీవల కాలంలో వైసీపీ కార్యకర్తలు చేస్తున్న కొన్ని కార్యక్రమాలపై పెద్ద ఎత్తున అసహనం వ్యక్తం అవుతుంది. ఇటీవల మైలవరం జగన్ ఓ పెళ్లి కార్యక్రమానికి హాజరు కాగా.. అక్కడ ఓ చిన్నారి సైకిల్ తీసుకుని వైసిపి కార్యకర్తలు దాన్ని విరగ్గొట్టారు.
Also Read : జగన్ చేష్టలతో షాక్ లో వైసీపీ
దీనికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. రాప్తాడు పర్యటనకు వెళ్ళిన సందర్భంగా కూడా వైసిపి కార్యకర్తలు హెలికాఫ్టర్ విషయంలో ఇలాగే ప్రవర్తించారు. ఇక తాజాగా జగన్ తెనాలి పర్యటన సందర్భంగా అక్కడి వైసిపి కార్యకర్తలు.. పోలీసు వాహనాలు ఎక్కి చేసిన హడావుడి చికాకుగా మారింది. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతుంది. దీనిపై టిడిపి నేతలు మండిపడుతున్నారు. పోలీసు వాహనం ఎక్కి హడావుడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.