ఎన్నికలు ముగిసి ఆరు నెలలైంది. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువైంది. కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన కొత్తల్లో దూకుడుగా వ్యవహరించినప్పటికీ.. ఇప్పుడిప్పుడే ప్రజా సమస్యలపై దృష్టి పెట్టారు. అదే సమయంలో గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఎత్తి చూపుతూ ఇప్పటికే కుదేలైన వైసీపీకి మరింత నష్టం కలిగించేలా చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో వైసీపీ కార్యకర్త మాత్రం తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరుపై ఏమనుకుంటున్నారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: అంతా అప్పటి సీఎం చేసిందే… కాళేశ్వరంపై ఐఏఎస్ సంచలనం
2019లో అధికారంలోకి వచ్చినప్పటికీ… 2024లో పదవి కోల్పోయిన తర్వాత కూడా జగన్‌లో ఎలాంటి మార్పు రాలేదనేది సగటు వైసీపీ కార్యకర్త మాట. ఇందుకు ఎన్నో ఉదాహరణలను చూపిస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు మీరే నా దేవుళ్లు అన్నట్లుగా ఓటర్లను వేడుకున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ బతిమిలాడారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత మీరెవరో నాకు తెలియదు అన్నట్లుగా వ్యవహరించాడు జగన్. పర్యటనల్లో ప్రజల ముఖాలు చూసేందుకు కూడా ఇష్టం లేనట్లుగా… పరాదాలు కట్టుకుని వెళ్లారు. ఇక జగన్ పర్యటన అంటే చాలు.. నాలుగు రోజులు ముందు నుంచే ఆ మార్గంలో అన్ని దుకాణాలు బంద్ చేయాల్సిందే.
Also Read : మెగా ప్లానింగ్ సూపర్… మరో స్టార్ డైరెక్టర్ ను లైన్ లో
ఇక ప్రభుత్వ పథకాల వివరణ సహా ఆరోపణలపై కూడా నాటి ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే మాట్లాడారు తప్ప మరొకరికి అవకాశం ఇవ్వలేదు. చివరికి పార్టీ అంటే సజ్జలే ఫైనల్ అనేలా మారిపోయిందనేది సగటు వైసీపీ కార్యకర్త మాట. ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ఇదే కారణమని పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఇక ఇదే సమయంలో చంద్రబాబు గురించి కూడా వైసీపీ నేతలు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. 2019లో వైసీపీ గెలిచిన తర్వాత చంద్రబాబు కేవలం నెల రోజులు మాత్రమే హైదరాబాద్‌లో ఉన్నారు. ఆ తర్వాత నుంచి నిరంతరం పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు.
Also Read: పాపం అవంతి.. భవిష్యత్తు ఏమిటో?
నిరంతరం పార్టీ నేతలను ఉత్తేజపరిచారు. టిడిపి ఓటమికి కారణాలను తెలుసుకున్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రణాళికలు వేశారు. ఇక లోకేశ్ కూడా యువగళం పాదయాత్రతో కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా దర్బార్ అంటూ లోకేశ్ వినతి పత్రాలు స్వీకరించి సమస్యలు పరిష్కరిస్తుండగా.. చంద్రబాబు కూడా రెండు వారాలకోసారి పార్టీ కార్యాలయానికి వచ్చిన కార్యకర్తలతో భేటీ అవుతున్నారు. కానీ జగన్ మాత్రం ఇప్పటికీ అదే నియంత పొకడలతోనే వ్యవహరిస్తున్నారు.
Also Read: ఏపీ కేబినేట్ లో అడుగుపెడుతున్న పల్లా…!
బెంగళూరు ప్యాలెస్‌లో ఉంటూ.. నెలకోసారి చుట్టపు చూపుగా తాడేపల్లి వస్తున్నారు. అలా వచ్చినప్పుడు ఓ ప్రెస్ మీట్ పెట్టేసి.. నాలుగు ఆరోపణలు చేసి పోతున్నారు తప్ప… ఇప్పటికి కూడా కార్యకర్తలు, నేతలతో భేటీ కావడం లేదు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, డిప్యూటీ సీఎంలు కూడా పార్టీ మారుతున్నా… కనీసం వారితో చర్చించి ఆపలేకపోతున్నారు. పైగా మళ్లీ సజ్జల రామకృష్ణారెడ్డినే పార్టీ కో ఆర్డినేటర్‌గా నియమించడంపై కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. ఇలా అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు సంగతి తర్వాత.. కనీసం పోటీ చేసేందుకు కూడా నాయకులు ముందుకు వచ్చేది లేదంటున్నారు వైసీపీ కార్యకర్తలు.