Friday, September 12, 2025 07:26 PM
Friday, September 12, 2025 07:26 PM
roots

వైసీపీ నేతలకు షెల్టర్ జోన్ గా బిజేపి, జనసేన

మావోయిస్ట్ ల గురించి అప్పుడప్పుడు వార్తల్లో కొన్ని విషయాలు వస్తూ ఉంటాయి. వేసవి కాలం అడుగుపెట్టే సమయంలో దట్టమైన అడవుల్లో ఆకులు రాలిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో భద్రతా బలగాల నిఘా నుంచి తప్పించుకోవడానికి వాగులు, వంకలు పారే దట్టమైన అటవీ ప్రాంతాలకు వెళ్ళిపోయి షెల్టర్లు ఏర్పాటు చేసుకుంటారు. దాడులకు కూడా అవకాశం తక్కువగా ఉండటంతో, నీటి సౌకర్యం వెతుక్కుని తమ రక్షణ కోసం అడవుల్లోకి వెళ్లిపోతు ఉంటారు. దీనితో జరిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చని… వారి వ్యూహం.

Also Read : పోలవరం కీలక ఘట్టం.. డయాఫ్రం వాల్ ప్రత్యేకతలు ఇవే…!

ఇప్పుడు ఏపీలో వైసీపీ నేతలు కూడా ఇదే చేస్తున్నారు. తమను తాము రక్షించుకోవడానికి అధికారంలో బలంగా కనపడుతున్న కూటమి పార్టీల్లో తమను తాము కాపాడుకోవడానికి వెళ్ళిపోతున్నారు. కూటమి పార్టీలపై చెలరేగిపోయే అవకాశం లేకపోవడం, కేసుల భయంతో షెల్టర్ జోన్ లు వెతుక్కుంటున్నారు. ఏపీలో వైసిపి బలహీన పడటం ఏమో గాని ఆ పార్టీ నేతలకు మాత్రం కాస్త రాజకీయ భవిష్యత్తుపై క్రమంగా భరోసా పెరుగుతోంది. గతంలో అక్రమాలు, అవినీతి, దౌర్జన్యాలు చేసిన నాయకులు ఇప్పుడు చాలా దర్జాగా ధైర్యంగా గంభీరంగా తిరిగేందుకు వేదికలు కూడా సిద్ధమైపోయాయి.

వాళ్లపై కేసులు, చర్యలు లేదంటే ప్రతీకారాలు పక్కన పెడితే ఇప్పుడు వాళ్లకు మాత్రం షెల్టర్ జోన్లు చక్కగా దొరుకుతున్నాయి. వైసీపీలో అన్ని రకాలుగా దందాలు చేసిన నాయకులు ఇప్పుడు బిజెపి, టిడిపి, టిడిపి లేదంటే జనసేన పార్టీలో తమ హవా కంటిన్యూ చేయడం మొదలుపెట్టారు. వైసీపీకి రాజీనామా చేసిన వెంటనే జనసేన పార్టీ లేదంటే బిజెపిలో జాయిన్ అయిపోతున్నారు. కొంతమంది తెలుగుదేశం పార్టీ వైపు కూడా చూస్తున్నారు. ఇటీవల జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన సామినేని ఉదయభాను అలాగే ఒంగోలుకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేన తీర్థం పుచ్చుకున్నారు.

Also Read : కొలికపూడికి మూడినట్టేనా…?

ఇక విశాఖ జిల్లాకు చెందిన అడారి కూడా జనసేన లేదంటే బిజేపిలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరి కొంతమంది నాయకులు కూడా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులు ఆధారంగా వాళ్లు పార్టీ మారడం కాస్త ఆలస్యమవుతూ వస్తోంది. తాజాగా నెల్లూరుకు చెందిన రవిచంద్ర రెడ్డి కూడా బిజెపిలో జాయిన్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. వైసీపీ తీరు నచ్చని ఆయన తీవ్ర ఆరోపణలు చేస్తూ బిజెపిలో జాయిన్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

రాజీనామా చేసి వైసీపీని తిడితే కూటమి నేతలు, సోషల్ మీడియాలో కార్యకర్తలు ఎంజాయ్ చేస్తారనే సీక్రెట్ తెలుసుకున్న సదరు నేతలు… చక్కగా తిడుతూ బయటకు వచ్చేస్తున్నారు. ఇక కడప జిల్లాకు చెందిన కొంతమంది నేతలు కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం ఇష్టం లేనివారు జనసేన లేదంటే బిజెపిలో ఏదో ఒకరకంగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ప్రకాశం జిల్లాకి చెందిన మాజీ మంత్రి ఒకరు కూడా ఇప్పటికే బీజేపీ నేతలతో సంప్రదింపులు మొదలుపెట్టారు.

Also Read : రాజకీయాల్లోకి పీవీ సునీల్.. బిజెపి ప్రోత్సాహంతో కూటమి ప్రయాణం

తెలుగుదేశం పార్టీ గేట్లు మూసి వేయడంతో ఈ రెండు పార్టీల్లోకి చేరికలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. టిడిపిలో జాయిన్ అవ్వడం కంటే బీజేపీలో జాయిన్ అయితే తమపై కేసులు ఉండవు.. భవిష్యత్తులో కూడా తమకు రక్షణ ఉంటుంది అనే భావంలో కొంతమంది నేతలు ఉంటున్నారు. ఇక గోదావరి జిల్లాలకు చెందిన ఒక వివాదాస్పద నేత కూడా జనసేన పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తమ బలం పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్న బిజెపి, జనసేన వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ తెలిసి కూడా పార్టీ మారడానికి సిద్ధంగా ఉంటే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాయి. దీనితో రెడ్ బుక్ కూడా పెద్దగా ప్రభావం చూపించడం లేదు అనేది చాలామంది క్లారిటీ వస్తుంది. ఇంకా కొంతమంది పోలీస్ అధికారులు కూడా రాజకీయ పార్టీలు పెట్టి బిజెపి అండదండలతో కూటమిలో జాయిన్ అయ్యేందుకు ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్