Friday, September 12, 2025 08:57 PM
Friday, September 12, 2025 08:57 PM
roots

క్యాచ్ కాదు మ్యాచ్ వదిలేసాడు.. జైస్వాల్ ముంచేసాడా..?

లీడ్స్ వేదికగా భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతోన్న తొలి టెస్ట్ లో భారత్ ఆధిక్యం దిశగా దూసుకు వెళ్తోంది. తొలి ఇన్నింగ్స్ లో 465 పరుగులకు ఇంగ్లాండ్ ఆల్ అవుట్ అయింది. దీనితో భారత్ కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో ఆ మాత్రం స్కోర్ చేయడానికి భారత పేలవ ఫీల్డింగ్ కారణం అనే చెప్పాలి. బెన్ డకేట్, ఒలీ పోప్, బ్రూక్ ఇలా భారీ స్కోరు చేసిన కీలక ఆటగాళ్ళు అందరూ భారత ఫీల్డర్లు క్యాచ్ లు వదిలేయడంతోనే బ్రతికిపోయారు. లేదంటే భారత్ కు కనీసం 150 పరుగుల ఆధిక్యం లభించి ఉండేది. అదే జరిగి ఉంటే.. ఈపాటికే టెస్ట్ పై భారత్ పట్టు బిగించి ఉండేది.

Also Read : పంత్ మరో అదిరిపోయే రికార్డ్..!

ఫీల్డర్ల లో ముఖ్యంగా జైస్వాల్ 3 కీలక క్యాచ్ లు వదిలేసాడు. 99 పరుగులు చేసిన బ్రూక్ కు పరుగుల ఖాతా తెరవకుండానే లైఫ్ వచ్చింది. బూమ్రా నో బాల్ కావడంతో బ్రూక్ బ్రతికిపోయాడు. ఆ తర్వాత మూడు సార్లు లైఫ్ వచ్చింది. జైస్వాల్ తో పాటు పంత్ కూడా ఒక క్యాచ్ వదిలేసాడు. దీంతో అతను 99 పరుగులు చేసాడు. బుమ్రా బౌలింగ్‌లో నాలుగు క్యాచ్‌లు వదిలేసినా.. అతను ఐదు వికెట్లు పడగొట్టాడు. 3వ రోజు టీకి ముందు భారత్ ఆరు క్యాచ్‌లను వదిలేసింది. 2019 తర్వాత ఒక టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ ఐదు లేదా అంతకంటే ఎక్కువ అవకాశాలను చేజార్చుకోవడం ఇదే మొదటిసారి.

Also Read : మీకు ఇదేం పిచ్చి రా బాబు..!

ఇక జైస్వాల్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్, జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లోనే మూడు క్యాచ్ లు వదిలేసాడు. 2వ రోజు చివరిలో మొదట బెన్ డకెట్‌ను 15 పరుగుల వద్ద గ్రాస్ అవుట్ చేశాడు. దీనితో డకేట్ 62 పరుగులు చేసాడు. ఆ తర్వాత అతను 60 పరుగుల వద్ద ఓలీ పోప్‌ క్యాచ్ వదిలేసాడు. చివరికి పోప్ 106 పరుగులు చేసాడు. 3వ రోజు హ్యారీ బ్రూక్ 83 పరుగులతో బౌలింగ్‌లో ఉండగా, జైస్వాల్ క్యాచ్ వదిలేసాడు. ఆ తర్వాత బ్రూక్ మరో 16 పరుగులు జోడించి రెండవ సెషన్‌లో 99 పరుగులకే అవుటయ్యాడు. ఈ క్యాచ్ లు పట్టి ఉంటే భారత్ కు ఖచ్చితంగా 150 పరుగులకు పైగా ఆధిక్యం లభించి ఉండేది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్