తెలుగుదేశం పార్టీని ఊరిస్తున్న వైస్ ఛైర్మన్ పదవి దాదాపు ఖాయమైంది. తుని మునిసిపాలిటీ వైఎస్ ఛైర్మన్ ఎన్నిక ఇప్పటికే 5 సార్లు వాయిదా పడింది. సరైన బలం లేకపోవడంతో ఎన్నిక వాయిదా పడుతూనే ఉంది. అయితే ఎలాగైనా దక్కించుకోవాలని పట్టుబట్టిన మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు తనదైన శైలిలో చక్రం తిప్పారు. చివరికి వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరడంతో… వైసీపీ నేతలకు గట్టి షాక్ తగిలినట్లైంది. చివరికి ఎంత ప్రయత్నం చేసినా సరే తుని మునిసిపాలిటీని వైసీపీ నేతలు తమ చెయ్యి జారకుండా ఆపలేకపోయారు. దీంతో ఫ్రెస్టేషన్‌తో వైసీపీ నేతలు తమదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తున్నారు ఇప్పుడు.
Also Read : పోసాని అరెస్ట్ తో వారిలో వణుకు మొదలైందా..?
ఏపీ వ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీల్లో వైస్ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించారు. ఇందులో అన్ని స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. మునిసిపల్ ఎన్నికలకు ఇంకో ఏడాది సమయం ఉండటంతో… చివరి ఏడాది అధికారం కోసం అధికార, ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో పోటీ పడ్డాయి. 2021లో ఎన్నికలు జరిగినప్పుడు వైసీపీ ప్రభుత్వం పూర్తి ఏకపక్షంగా వ్యవహరించింది. దాదాపు 80 శాతం మునిసిపాలిటీలను సొంతం చేసుకున్న వైసీపీ… చివరికి టీడీపీ నేతలు నామినేషన్ కూడా వేయకుండా దౌర్జన్యం, దాడులు చేశారు. కొన్ని చోట్ల టీడీపీ, జనసేన అభ్యర్థులను కిడ్నాప్ కూడా చేశారు. దీంతో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని అప్పట్లో తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసినా… పెద్దగా పట్టించుకోలేదు.
Also Read : బీఆర్ఎస్ కు నిద్ర లేకుండా చేస్తున్న రేవంత్ టూర్
వైసీపీ ప్రభుత్వ పాలనలో ఏపీలోని ఏ ఒక్క మునిసిపాలిటీలో కూడా కనీస అభివృద్ధి జరగలేదనేది బహిరంగ రహస్యం. ఇదే విషయాన్ని వైసీపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూడా బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చివరి ఏడాది అయినా తమ వార్డుల్లో అభివృద్ధి పనులు చేయకపోతే… రాబోయే ఎన్నికల్లో ఓటర్లు తమను ఓడిస్తారని భయపడ్డారు. దీంతో మెజారిటీ వైసీపీ సభ్యులు కూటమి పార్టీల్లో చేరిపోయారు. దీంతో పలు మునిసిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలను టీడీపీ దక్కించుకుంది. తుని మునిసిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికను కౌన్సిలర్లు లేరనే సాకుతో వైసీపీ నేతలు ఇప్పటికే పలుమార్లు వాయిదా వేశారు. అయితే ఇటీవల ఏకంగా 8 మంది వైసీపీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే యనమల దివ్య సమక్షంలో టీడీపీలో చేరారు. దీంతో తుని మునిసిపాలిటీ వైస్ చైర్మన్ స్థానం కూటమి ఖాతాలో చేరడం లాంఛనమైంది. అయితే గతంలో తమ ప్రభుత్వంలో చేసిన అరాచకాలను మర్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ నేతలు దౌర్జన్యం చేసి కౌన్సిలర్లను లాక్కున్నారని వింత ఆరోపణలు చేస్తున్నారు.