Friday, September 12, 2025 05:16 PM
Friday, September 12, 2025 05:16 PM
roots

తప్పు చేస్తే.. ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే..!

జర్నలిస్టులం.. మేము ఏం చేసినా చెల్లుతుంది అనే వారికి ఇదో గుణపాఠం అనే చెప్పాలి. రాజకీయ పార్టీ అండతో నడుస్తున్న సంస్థలో ఉద్యోగులైనా సరే.. కొన్ని విలువలు పాటించాల్సిందే. అలా కాని రోజున ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. ముఖ్యంగా పవిత్రమైన పాత్రికేయ వృత్తిలో ఉన్న వాళ్లు కొన్ని విషయాల్లో తప్పనిసరిగా కొన్ని విషయాలను తమ మదిలో పెట్టుకోవాల్సిందే. అది టీడీపీ అయినా సరే.. వైసీపీ అయినా సరే.. ఏ పార్టీకి అనుకూల మీడియా అయినా సరే.. పాత్రికేయ విలువలు పాటిస్తేనే.. వారికి సమాజంలో గౌరవం దక్కుతుంది. అలాంటివి పాటించకుండా కేవలం పార్టీ అజెండా మాత్రమే నెత్తికి ఎత్తుకుంటే మాత్రం.. ఇదిగో.. ఇలాగే.. కొమ్మినేనికి పట్టిన గతే పడుతుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు.

Also Read : వైసీపీలో నువ్వుంటే చాలంటున్న టీడీపీ నేతలు..!

పాత్రికేయ వృత్తిలో 40 ఏళ్ల అనుభవం.. ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా చేసిన ఘనత.. ఎంతో మందికి జర్నలిజం పాఠాలు నేర్పిన చరిత్ర. 65 ఏళ్ల వయస్సులో ఇలాంటి వ్యక్తిని ఎలా అరెస్టు చేస్తారనేది ఇప్పుడు ప్రశ్న. సీనియర్ సిటిజన్‌ను అరెస్టు చేయడం తప్పు అనేది ఇప్పుడు వైసీపీ నేతల మాట. మరి ఇదే ప్రశ్న 2023లో చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు ఎందుకు రాలేదు. ఆరోజు చంద్రబాబు వయసు 73 ఏళ్లు. అంటే కొమ్మినేని శ్రీనివాసరావు కంటే వయసులో 8 ఏళ్లు పెద్ద. మరి ఆరోజు వయసు గుర్తుకు రాలేదా. ఫేస్ బుక్‌లో వచ్చిన ఒక పోస్టును షేర్ చేశారనే కారణంతో గుంటూరుకు చెందిన 60 ఏళ్ల రంగనాయకమ్మను వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు అరెస్టు చేశారు. మరి ఆరోజు ఆమె సీనియర్ సిటిజన్ అనే విషయం వైసీపీ నేతలు మర్చిపోయారా.. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని ఉదాహరణలు.

ఇక ప్రస్తుతంలోకి వస్తే.. పాత్రికేయ వృత్తి ప్రారంభం నుంచి దాదాపు 25 ఏళ్ల పాటు ఈనాడు సంస్థలోనే కొమ్మినేని పని చేశారు. సాధారణ రిపోర్టర్ స్థాయి నుంచి ఢిల్లీ బ్యూరో చీఫ్ వరకు చేరుకున్నారు. 1982లో టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ నేతలతో ప్రత్యేక అనుబంధం ఉంది. 1983లో టీడీపీ సంక్షోభం వార్తలను కవర్ చేశారు. 1995 ఆగస్టు సంక్షోభం, వైశ్రాయ్ హోటల్ దగ్గర కూడా న్యూస్ కవర్ చేసింది ఎవరూ అంటే… నాటి హైదరాబాద్ బ్యూరో హెడ్ కొమ్మినేని అనేది నేటికి టీడీపీ సీనియర్లు, ఆయన సహచరులు చెబుతారు కూడా. ఇక ఈనాడు జర్నలిజం స్కూల్‌లో ఎంతో మందికి జర్నలిజంలో పాటించాల్సిన సూత్రాలు బోధించారు. పాత్రికేయులు వాడాల్సిన భాష, రాయాల్సిన పదాలు, ఉచ్ఠరించాల్సిన మాటలపై స్పష్టమైన అవగాహనతోనే పాఠాలు చెప్పారు.

Also Read : అది సంకర జాతి కాదా సజ్జల..?

చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా మెలిగిన కొమ్మినేని.. క్రమంగా డిజిటల్ మీడియా వైపు దృష్టి పెట్టారు. అప్పటి నుంచే కొమ్మినేనిలో పైత్యం బయటకు వచ్చిందనేది ఆయన సన్నిహితుల మాట. ఈనాడులో ఉద్యోగం చేస్తున్నంత కాలం ఎలాంటి వివాదాలు లేవు. కానీ ఆ తర్వాత శాటిలైట్ ఛానల్‌లో డిబేట్‌ మొదలుపెట్టిన తర్వాత తనలోని మరో వ్యక్తిని బయటకు తీశారు. టీఆర్‌పీ రేటింగ్ కోసం రెండు పార్టీలకు చెందిన నేతల మధ్య చిచ్చు పెట్టడం మొదలుపెట్టారు. తన లైవ్ డిబేట్‌లో తెలంగాణకు చెందిన ఇద్దరు యువకులు తన్నుకునేంత వరకు వారిద్దరిని రెచ్చగొట్టారు. ఒకరిపై ఒకరు చెయ్యి చేసుకుంటున్నప్పుడు కూడా.. తప్పు తప్పు అన్నారు తప్ప.. సీటులో నుంచి వెళ్లి వాళ్లిద్దరిని విడదీయలేదు.

Also Read : ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చేందుకు బాబు, పవన్ రెడీ

సంస్థ పాలసీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో డైరెక్టర్ పోస్టు నుంచి తొలగిస్తే.. అందుకు చంద్రబాబు కారణమనే అక్కసుతో నేరుగా సాక్షి సంస్థలో చేరారు. నాటి నుంచి పాత్రికేయ విలువలు తిలోదకాలిచ్చారు. తానొక సీనియర్ జర్నలిస్టు అనే కనీస విషయం మర్చిపోయారు. తనను తాను వైసీపీ కార్యకర్తగా ఊహించుకుని.. తన డిబేట్‌లో, విశ్లేషణలో కూడా కేవలం టీడీపీకి వ్యతిరేకంగా వార్తలు రాయడం మొదలు పెట్టారు. వాస్తవానికి పాత్రికేయ వృత్తిలో సార్, మేడం, గారు, శ్రీ, శ్రీమతి అనే పదాలకు చోటు లేదు. ఈ విషయం కొన్ని లక్షల వార్తలు రాసిన కొమ్మినేనికి బాగా తెలుసు కూడా. తాను ఈనాడు సంస్థలో పనిచేస్తున్న సమయంలో కూడా రామోజీరావు పేరుకు ముందు వెనుక కూడా ఎక్కడా గౌరవార్థకాలు వాడలేదు. కానీ సాక్షిలో చేరిన తర్వాత మాత్రం కొమ్మినేనిలో స్వామి భక్తి బయటకు వచ్చింది. జగన్ సార్, భారతీ మేడం.. ముఖ్యమంత్రి గారు.. అని సంబోధించారు. మరి అదే సమయంలో చంద్రబాబును మాత్రం.. ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ వ్యాఖ్యానించారు. ఇదేంటి.. జగన్‌ సార్‌కు ఓ నీతి.. చంద్రబాబుకు ఓ నీతి.. ఏట్లా అంటే.. అదంతే.. అలాగే అంటాం.. అంతా మా ఇష్టం.. అంటున్నారు సాక్షి ఉద్యోగులు.

Also Read : ఆ మంత్రులను వెంటాడుతున్న చంద్రబాబు

ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ వంటి ఉన్నత స్థానంలో కొమ్మినేని శ్రీనివాసరావు ఏడాదిన్నర పాటు వ్యవహరించారు. 2022 నవంబర్ 10వ తేదీ నుంచి 2024 జనవరి వరకు ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా కొనసాగారు. ఆ సమయంలో కూడా పాత్రికేయులకు ఆయన చేసిన మేలు ఏమైనా ఉందా అంటే.. జీరో అనే చెప్పాలి. మీడియాపై పదే పదే దాడులు జరుగుతున్నా సరే.. ఏ రోజు కొమ్మినేని ఆఫీసు నుంచి ఎలాంటి ఖండన రాలేదు. అమరావతి అనుకూలంగా మాట్లాడిన సీనియర్ పాత్రికేయులపై కేసులు పెడితే.. అలా ఎందుకు చేశారని పోలీసులకు నోటీసులు ఇచ్చిన పాపాన పోలేదు. ఏపీ వ్యాప్తంగా అధికారిక వాహనంలో పర్యటనలు చేసిన కొమ్మినేని.. కనీసం ఒక్క జర్నలిస్టుకు కూడా సెంటు భూమి ఇచ్చిన దాఖలాలు లేవు. పైగా అక్రిడేషన్ కార్డుల కేటాయింపులో కూడా వివక్ష చూపించారు. వైసీపీ సోషల్ మీడియా సైకోలకు కూడా సాక్షి సంస్థలో పనిచేస్తున్నట్లు చూపించి మీడియా అక్రిడేషన్ కార్డులు జారీ చేశారు.

ఇక ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా ఉంటే.. తన బాసుకు న్యాయం చేయలేనేమో అనే భయంతో.. ఛైర్మన్ పదవికి రాజీనామా చేసిన కొమ్మినేని.. మళ్లీ సాక్షి డిబేట్‌లో పాల్గొన్నారు. తనకు ప్రభుత్వ అధికారిక హోదా కల్పించిన జగన్‌పై స్వామి భక్తి ప్రదర్శించారు. అందుకే అమరావతిపై విషం చిమ్మారు. మూడు ముక్కలాటగా మారిన మూడు రాజధానుల ప్రకటనపై ప్రశంసల జల్లు కురిపించారు. జగన్ పాలనలో అంతా హాయిగా ఉన్నారని.. ఎవరి పైనా ఎలాంటి దాడులు జరగలేదని.. అంతా టీడీపీ నేతల కుట్ర అంటూ వాస్తవాలను కప్పిపుచ్చి.. తానోక పాత్రికేయుడిని అనే విషయం కూడా మర్చిపోయారు.

Also Read : చేరికలపై చంద్రబాబు సంచలన నిర్ణయం

ఇక వైసీపీ ఓడిన తర్వాత కూడా కొమ్మినేని తీరులో ఎలాంటి మార్పు రాలేదు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా డిబేట్‌కు లక్ష్మి పార్వతిని ఆహ్వానించారు. ఆ రోజు ఓ కాలర్ ఫోన్ చేసి.. ఎన్టీఆర్‌కు స్టెరాయిడ్స ఇచ్చారంట కదా అనే మాటకు.. తీవ్రంగా స్పందించారు. ఇలా మాట్లాడటం తప్పు అన్నారు. మీ ఇంట్లో మహిళలు లేరా అని వ్యాఖ్యానించారు. కానీ సరిగ్గా వారం రోజులకే కృష్ణంరాజు అనే విశ్లేషకుడు అమరావతి ప్రాంతంపైన, ఏపీ మహిళలపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం.. పళ్లు ఇకిలించారు. నవ్వారు… ఇలా మీరు అంటే.. మిమ్మల్ని ట్రోల్ చేస్తారంటూ వెకిలిగా వ్యాఖ్యానించారు. అంతే తప్ప డిబేట్ నుంచి కృష్ణంరాజును వెళ్లిపోండి అని అనలేదు. పైగా మరో అరగంట పాటు డిబేట్ కొనసాగించారు.

జర్నలిస్టులం.. మమ్మల్ని ఏం చేయలేరు అనే వారికి కొమ్మినేని ఓ ఉదాహరణ. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి, వర్గ విభేదాలు రెచ్చగొట్టేలా వ్యవహరించిన వారు ఎవరైనా సరే.. చట్టానికి అతీతులు కాదు. తాము ఏ సంస్థలో పని చేస్తున్నా సరే.. కనీస విలువలు పాటించాల్సిందే. రాసే భాష, పలికే పదం సమాజ హితం కోసమే అనే కనీస స్పృహ కోల్పోయిన వారు ఇలాగే శ్రీ కృష్ణ జన్మస్థానం పాలవుతారనేది సీనియర్ పాత్రికేయుల మాట.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్