Saturday, September 13, 2025 01:23 AM
Saturday, September 13, 2025 01:23 AM
roots

అమరావతిలో వరల్డ్ బ్యాంక్ బృందం పర్యటన..!

ఏపీ రాజధాని అమరావతి పనుల పురోగతిపై ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ బృందం విజయవాడలోని ఏపీ సీఆర్డిఏ కార్యాలయంలో వరుసగా 3 రోజుల పాటు అధికారులతో సమావేశమైంది. ఏపీ సీఆర్డిఏ కమిషనర్ కె.కన్నబాబు ఐఏఎస్, అడిషనల్ కమిషనర్లు జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్, మల్లారపు నవీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన “అర్బన్ గవర్నెన్స్” అంశంపై వర్క్ షాప్‌లో అధికారుల బృందం పాల్గొంది. వివిధ దేశాలలో “అర్బన్ గవర్నెన్స్” ప్రక్రియలో అమలవుతున్న అత్యుత్తమ విధానాల గురించి, ఆయా ప్రాంతాలలో పర్యావరణ పరిరక్షణకు పాటిస్తున్న చర్యల గురించి వరల్డ్ బ్యాంక్, ఆసియా డెవలప్‌మెంట్్ బ్యాంక్ సభ్యులు సీఆర్‌డీఏ, ఏడీసీఎల్ అధికారులతో చర్చించారు. అమరావతి నిర్మాణంలో ఆయా ప్రాజెక్టుల పురోగతి గురించి బ్యాంక్ అధికారుల బృందానికి అడిషనల్ కమిషనర్లు వివరించారు. అలాగే రాజధానిలో ల్యాండ్ మోనిటైజేషన్ అంశాల గురించి వర్క్ షాప్‌లో చర్చించారు.

Also Read : రేవంత్ రెడ్డి – ఆరా మస్తాన్ ఫోన్ ట్యాపింగ్.. ఆధారాలతో బయటపెట్టిన సిట్

రాజధాని అమరావతి నిర్మాణంలో ముఖ్యంశాలతో పాటు ఆర్థికాభివృద్ధి, రవాణా సదుపాయాల కల్పన, హౌసింగ్ ప్రాజెక్టులు, ప్రైవేట్ సెక్టార్ భాగస్వామ్యం, పౌరసేవల కల్పన తదితర అంశాలలో ఏపీ సీఆర్డీఏ ప్రాతినిధ్యం, అలాగే విపత్తు నివారణ కార్యకలాపాలు, సమగ్ర సదుపాయాలతో కూడిన రాజధాని నగర నిర్మాణం గురించి అడిషనల్ కమిషనర్లు బ్యాంక్ అధికారుల బృందానికి వివరించారు. ఆయా ప్రాజెక్టులకు సంబంధించి అధికారులు అడిగిన ప్రశ్నలకు సంతృప్తికర రీతిలో సమాధానాలు ఇచ్చారు. వర్క్ షాప్‌లో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్.. ఏడీసీఎల్ సీఎండీ లక్ష్మి పార్థసారథి, సిఆర్డిఏ, ఏడీసీఎల్‌లోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Also Read : సిఎం వర్సెస్ డిప్యూటి సిఎం.. కన్నడ నాట ఏం జరుగుతోంది..?

వరల్డ్ బ్యాంక్ బృంద సభ్యుల రాజధాని అమరావతి పనుల పురోగతిపై చర్చించారు. రాజధానిలో నిర్మిస్తున్న భవనాల పనులలో పురోగతి, రాజధాని ప్రాంత నివాసితులకు అమలవుతున్న సామాజిక సంక్షేమ కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ, విపత్తు నిర్వహణకై చేపట్టిన కార్యకలాపాలు, కార్మికులు, మహిళల భద్రతకై అమలవుతున్న చర్యల పట్ల పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంతంలో పర్యటించిన అధికారుల బృందం సీఆర్‌డీఏ చేపట్టిన పనులపై వివరాలు సేకరించింది. తుది దశలో మెరుగులు దిద్దుకుంటున్న సీఆర్‌డీఏ భవనాన్ని అధికారుల బృందం పరిశీలించింది. దీనిపై త్వరలో పూర్తిస్థాయి నివేదిక సమర్పిస్తామని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా 2027 నాటికి అమరావతి ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసేలా పనులు జరుగుతున్నాయని సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్