ఆంధ్రప్రదేశ్ శాసన సభా సమావేశాల్లో గత అయిదేళ్లుగా మిస్ అయిన కొన్ని సన్నివేశాలు ఇప్పుడు ఆసక్తిగా మారుతున్నాయి. గత అయిదేళ్లుగా ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేలు మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ అనే చెప్పాలి. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత అసెంబ్లీలో కాస్త ప్రత్యేక వాతావరణం కనపడుతోంది. ప్రజలకు ప్రత్యేకం కాదు.. వైసీపీని సమర్ధించే వాళ్లకు వింత వాతావరణం అనే చెప్పాలి. టీడీపీ మహిళా ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై శాసన సభా సమావేశాల్లో గళం ఎత్తడం పట్ల నియోజకవర్గాల్లో ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read : లెక్కలతో అవినాష్ రెడ్డి బండారం బయటపెట్టిన రవి
కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి రెడ్డి… తన నియోజకవర్గంలోని సమస్యల పట్ల శాసన సభలో ప్రస్తావించి… ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళారు. గతంలో తన నియోజకవర్గంలో ఎంత అన్యాయం జరిగింది అనే విషయాన్ని ఆమె లెక్కలతో సహా వివరించారు. ఇక సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ కూడా అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగించారు. వీరు అందరూ సభకు కొత్త అయినా సరే ఏ మాత్రం భయపడకుండా మాట్లాడుతున్నారు. అలాగే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సైతం కోవూరు నియోజకవర్గ సమస్యలను సిఎం దృష్టికి తీసుకుని వెళ్తున్నారు.
Also Read : నయనతార, ధనుష్ గొడవేంటి…? ధనుష్ కోపం చల్లారలేదా…?
గౌతు శిరీష కూడా పలాస నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై సభలో మాట్లాడుతున్నారు. ఇలా దాదాపుగా మహిళా ఎమ్మెల్యేలు అందరూ సభలో తమ నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తున్నారు. గతంలో మహిళా ఎమ్మెల్యేలు గాని మహిళా మంత్రులు గాని మాట్లాడితే… జగన్ పై పొగడ్తల కోసమే మాట్లాడిన పరిస్థితి ఉండేది. విడదల రజనీ, ఉష శ్రీ… పద్మావతి ఇలా ప్రతీ ఒక్కరు జగన్ గురించి కవితలు వినిపించేవారు. కానీ ఇప్పుడు ప్రజా సమస్యలపై మాట్లాడటం హర్షణీయం అంటున్నారు ప్రజలు.