ఓ వైపు తెలుగుదేశం పార్టీ మహానాడు పండుగను అట్టహాసంగా నిర్వహిస్తోంది. వైసీపీ కంచుకోట కడపలో మహానాడు సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఏకంగా 3 రోజుల పాటు కడప సమీపంలోని చెర్లోపల్లి వద్ద 500 ఎకరాల్లో మహానాడు నిర్వహిస్తున్నారు. ఓ వైపు భారీ వర్షాలు కురుస్తున్నా.. తెలుగు తమ్ముళ్లు మాత్రం అవేవీ లెక్క చేయకుండా కడప గడపలో కదం తొక్కారు. కడప నగరాన్ని పసుపు మయం చేశారు. కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రం నలుమూలల నుంచి కడపకు తెలుగు తమ్ముళ్లు చేరుకున్నారు. ఏకంగా 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది టీడీపీ.
Also Read : వైసీపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు..!
అయితే ఇదే సమయంలో వైసీపీ అధినేత తీరును.. సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. పార్టీ ఓడిన తర్వాత ఇప్పటి వరకు కార్యకర్తల కోసం కానీ.. ఏపీ ప్రజల వైపు కూడా జగన్ ఎలాంటి కార్యక్రమం చేయలేదు. అయితే ఒక్క విషయంలో మాత్రం జగన్ ఎప్పుడూ ముందు ఉంటారు. అదే శవ పరామర్శ. ఎక్కడ శవం ఉంటే.. అక్కడికి వెళ్లారు. అక్కడ కూడా నవ్వుతూ పరామర్శలు చేశారు తప్ప.. పార్టీ సూచించిన కార్యక్రమాల్లో కూడా జగన్ కనీసం పాల్గొనలేదు. చివరికి పహల్గావ్ దాడికి నిరసనగా తాడేపల్లి ప్యాలెస్ బయట నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో కూడా జగన్ పాల్గొనలేదు. ఇక తాజాగా పొగాకు రైతుల సమస్యలు వినడానికి, వారికి ధైర్యం చెప్పడానికి, వారి తరపున పోరాటం చేసి వారికి గిట్టుబాటు ధర ఇప్పించడానికి అంటూ ఈ నెల 28న ప్రకాశం జిల్లా పొదిలిలో వైఎస్ జగన్ పర్యటిస్తారని గొప్పగా ప్రకటించారు వైసీపీ నేతలు. కానీ చివరి నిమిషంలో ఆ పర్యటన రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. ఇందుకు చెప్పిన ఏకైక కారణం భారీ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి.. హెలికాఫ్టర్‌కు అనుమతి లేదంటున్నారు. దీంతో జిల్లాకు చెందిన వైసీపీ నేతలపై కార్యకర్తలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఇంకెందుకు అని విమర్శలు చేస్తున్నారు.
Also Read : టీడీపీ ఫ్యూచర్ లీడర్ పై అధ్యక్షుని క్లారిటీ..!
ఇదే సమయంలో వైసీపీలో ముఖ్యనేతల అరెస్టు వ్యవహారం కూడా పార్టీ కార్యకర్తలను కలవరపెడుతోంది. వైసీపీకి తొలి నుంచి అండగా ఉన్న నేతల కోసం కూడా జగన్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే అపవాదు మూట గట్టుకున్నారు. మొదటి నుంచి జగన్ వెంట నడిచిన నేతలు ఒక్కొక్కరుగా జైలుకు పోతున్నా సరే.. వారి కోసం పార్టీ తరఫున ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. ఈ పరిణామాలు వైసీపీ పునాదులను కుదిపేస్తున్నాయి కూడా.
ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిని ఏపీ పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. మైనింగ్ అక్రమాలతో పాటు ఎస్టీలపై దాడులకు తెగబడినందుకే కాకాణిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసిన వెంటనే కాకాణి పరారయ్యారు. దాదాపు 2 నెలల పాటు అజ్ఞాతంలో ఉన్నారు. చివరికి బెంగళూరులో పోలీసులకు చిక్కారు కాకాణి. వాస్తవానికి కాకాణికి రెడ్డి సామాజిక వర్గంలో గట్టి పట్టుంది. అలాగే వైసీపీలో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న నేత. ఇలాంటి వారిని కూడా జగన్ కాపాడుకోలేక పోయారనేది సగటు వైసీపీ కార్యకర్త ఆవేదన.
Also Read : ఆళ్ళకు ముహుర్తం ఖరారు అయిందా..?
మరోవైపు పల్నాడు జిల్లాలో వైసీపీకి అన్ని విధాలుగా అండగా ఉన్న పిన్నెల్లి బ్రదర్స్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఇటీవల జరిగిన జంట హత్యల్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు ఏ6గా, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి పేరు ఏ7గా పోలీసులు చేర్చారు. దీంతో వారిద్దరు కూడా త్వరలో అరెస్టు ఖాయమనే మాట వినిపిస్తోంది. అదే జరిగితే.. పల్నాడు జిల్లాలో వైసీపీ చుక్కాని లేని నావ అవుతుంది. ఇదే సమయంలో మరో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అదే జరిగితే.. వైసీపీ భవిష్యత్తు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్యాలెస్‌లో ఉంటూ.. అప్పుడప్పుడు మీడియా ముందుకు వస్తే.. ప్రజలు ఎలా నమ్ముతారు అని అధినేతను నిలదీస్తున్నారు.