Saturday, September 13, 2025 03:06 AM
Saturday, September 13, 2025 03:06 AM
roots

వర్మని ప్రభుత్వం క్షమిస్తే.. ప్రజలు టిడిపిని క్షమిస్తారా?

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని వాళ్ళు కూడా చెలరేగిపోయారు. అందులో ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా మంచి ఇమేజ్ సంపాదించుకున్న వర్మ.. తరువాత ‘బి గ్రేడ్’ సినిమాలు తీసే స్థాయికి దిగజారిపోయాడు. అవి కూడా నడవకపోవడంతో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలు వరస్ట్ గా తెరకేక్కిస్తూ… సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు ఫోటోలు పోస్ట్ చేసి మీడియాలో సందడి చేయడం స్టార్ట్ చేసారు. వైసీపీ అధిష్టానం ఆదేశాలతోనే ఆయన అప్పట్లో రేచ్చిపోయారని టీడీపీ సోషల్ మీడియా తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతూ ఉండేది.

Also Read :మ్యాన్సన్ హౌస్ అఫీషియల్ బ్రాండ్ అంబాసీడర్ బాలయ్యే

ఇక ఇప్పుడు ప్రభుత్వం మారడంతో… వర్మకు ముహూర్తం ఫిక్స్ చేశారు టిడిపి నాయకులు. వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందన్న ధీమాతో ఉన్న వర్మ.. ఇప్పుడు భయపడుతున్నారు. మద్దిపాడు పోలీసులు విచారణకు రావాలని వర్మకు నోటీసులు ఇస్తే ఆయన మాత్రం… కేసు విచారణపై దాగుడుమూతలు అడుతున్నారు. రామ్‌గోపాల్ వర్మ పోలీసుల విచారణను తప్పించుకోవాలని చూస్తున్నారనే విషయం క్లియర్ గా అర్ధమవుతోంది. వారం రోజుల సమయం కావాలని కోరడంలో వర్మ అంతర్యం ఏంటి అనే దానిపై ఇప్పుడు పోలీసు వర్గాలు కూడా ఆరా తీస్తున్నాయి.

వారం రోజుల పాటు విచారణకు సమయం కోరిన వర్మ.. హైకోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసారు. వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారించే అవకాశం ఉంది. షూటింగ్‌లు ఉన్నాయనే కారణం చూపి విచారణకు సమయం కోరిన వర్మ… అసలు కేసు నోటీసులు ఇచ్చే సమయానికి… ఆయనకు ఏ షూటింగ్ లు లేవు. దీనితో వర్మ షూటింగ్‌లపై సినీ వర్గాల్లో చర్చ మొదలైంది.

Also Read :వైసీపీలో సజ్జల ముసలం….!

షూటింగ్‌కి సంబంధించి ముందస్తుగా ఎలాంటి షెడ్యూల్‌ లేదనేది అంటున్నాయి సినీ వర్గాలు. వర్మ నిన్న, ఇవాళ వర్మ ఎలాంటి షూటింగ్‌లో పాల్గొనలేదని చెబుతున్న సినీ వర్గాలు… రెండు రోజులు పార్క్ హయత్ హోటల్ లోనే ఉన్నారని అంటున్నాయి. పోలీసుల విచారణను తప్పించుకునేందుకే.. షూటింగ్‌ ఫిక్స్‌ చేశారని పోలీసులు భావిస్తున్నారు. ఓవైపు షూటింగ్‌ల పేరిట సమయం కోరడం…మరోవైపు హైకోర్టులో పిటిషన్‌ వేయడంపై విచారణను దాటవేసేందుకు ప్రయత్నిస్తున్నారనే చర్చ జరుగుతోంది.

డబ్బు కోసం లేక అధికారం అండ చూసుకుని వికృత చేష్టలు చేసే ఇలాంటి వారికి తగిన శిక్ష పడకపోతే.. రేపు మరొకరు ఇలాంటి తప్పులని చేసే అవకాశం ఉంది. అలాంటి అవకడం ఇవ్వకూడదు అనుకుంటే ఇలాంటి ఊసరవెల్లి వ్యక్తులకు తగిన శిక్ష పడాలి అని ప్రజలు భావిస్తున్నారు. వావి వరసాలకి విలువ ఇవ్వని ఇలాంటి వ్యక్తులు సమాజానికి హాని అని, రాంగోపాల్ వర్మ లాంటి వ్యక్తులని క్షమిస్తే ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరు అంటూ ప్రజలు, పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్