Saturday, September 13, 2025 01:09 AM
Saturday, September 13, 2025 01:09 AM
roots

బాలయ్య పెట్టుకున్న నమ్మకాన్ని ప్రశాంత్ వర్మ నిలబెడతాడా..?

ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉన్న యంగ్ డైరెక్టర్లలో ప్రశాంత్ వర్మ ఒకరు. తనను తాను స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో బాగా కష్టపడుతున్నాడు. ఇక ఇప్పటికే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇక రీసెంట్ గా ఆయన చేసిన ‘హనుమాన్ సినిమాతో భారీ విజయంతో పాటు యువతలో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న ఆయన ఇప్పుడు ‘జై హనుమాన్’ సినిమాని చేస్తున్నాడు.

ఇక దీంతో పాటుగా బాలయ్య బాబు కొడుకుని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసే ఒక పెద్ద బాధ్యతను తన భుజాల మీదకి తీసుకున్నాడు. మరి ఈ బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. బాలయ్య కొడుకు అయిన మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఆయన ఎంచుకున్న కథ చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక సోషియో ఫాంటసీ కథతో ఆ సినిమాని తెరకెక్కించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారట. ఇప్పటికే కథ మొత్తాన్ని ఫినిష్ చేసి బాలయ్య బాబుకు వినిపించినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక బాలయ్య బాబు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న మోక్షజ్ఞ మొదటి సినిమాతోనే తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.

Read Also : దేవర కోసం సైఫ్ కష్టాలు.. మరీ ఈ రేంజ్ లోనా…?

ఇక మొదటి సినిమా కనక ఫ్లాప్ అయితే ఆయన మీద ప్రేక్షకుల్లో ఇంప్రెషన్ అనేది అంత పెద్దగా ఉండదు. కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని అందించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక బాలయ్య బాబు అంతగా నమ్మి మోక్షజ్ఞ ను ప్రశాంత్ వర్మ చేతిలో పెడితే ఆయన ఎలాంటి క్రెడిట్ ని మోక్షజ్ఞ కి అందిస్తాడు అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. మరి ప్రశాంత్ వర్మ మీద బాలయ్య బాబు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాడా లేదా అనేది చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్