భారత క్రికెట్ జట్టులో.. కొందరు ఆటగాళ్ల విషయంలో వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు ఇంగ్లాండ్ పర్యటనలో పెద్ద ఎత్తున వచ్చాయి. ముఖ్యంగా స్పిన్ కు అనుకూలంగా ఉండే వేదికల్లో కూడా కుల్దీప్ యాదవ్ కు అవకాశం ఇవ్వలేదని మాజీ ఆటగాళ్లు, అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్లు కూడా దీనిపై పెదవి విరిచారు. టెస్ట్ క్రికెట్లో నిలకడగా బౌలింగ్ చేయడమే కాకుండా అవసరమైన సందర్భంలో బ్యాటింగ్ లో కూడా రాణించగలిగే సామర్థ్యం కులదీప్ యాదవ్ కు ఉంది.
Also Read : దుర్గమ్మ శరన్నవరాత్రి మహోత్సవాలు..!
ఇక ఇప్పుడు ఆసియా కప్ కు ఈ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ ఎంపిక అయ్యాడు. దీనితో అతనికి తుదిజట్టులో అవకాశం లభిస్తుందా లేదా అనేదానిపై మళ్ళీ చర్చ మొదలైంది. రోహిత్ శర్మతో సన్నిహితంగా ఉండే కుల్దీప్ యాదవ్ కు అవకాశం ఇవ్వడం లేదని అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్కల్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో జరగబోయే మ్యాచ్ లో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అంశంపై మాట్లాడాడు. ఈ ఆసియా కప్ లో గేమ్ చేంజర్.. మాత్రం కుల్దీప్ యాదవ్ అని స్పష్టం చేశాడు.
Also Read : చిరంజీవితో మరోసారి శర్వానంద్ ఢీ..!
యాదవ్ తన కెరీర్ లో ఎన్నో ఓవర్లు బౌలింగ్ చేశాడని.. టి20లకు ఎలా సన్నద్ధం కావాలో అతనికి బాగా తెలుసు అన్నాడు. పరిమితి ఓవర్ల క్రికెట్లో కుల్దీప్ యాదవ్ స్పెషల్ బౌలర్ అన్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో అవకాశం రాకపోయినా సరే అతని ఆటిట్యూడ్ మాత్రం అలానే ఉందని.. ఎప్పుడు అవకాశం వచ్చినా సరే నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నాడని కామెంట్ చేశాడు. ఇక స్పిన్ ఆల్రౌండర్ కోటాలో అక్షర పటేల్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. అతనితో పాటు వరుణ్ చక్రవర్తికి కూడా ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. అయితే ఫాస్ట్ బౌలర్లలో బూమ్రా లేదా హర్షిత్ రానాలో ఒకరికి మాత్రమే చోటు దక్కనుంది.