తెలంగాణలో బీసీ నినాదం అనేది బలంగా వినపడుతోంది. రాజకీయంగా ఇప్పటివరకు తెలంగాణలో బీసీలు అధికారం చేపట్టకపోవడంపై ఆ వర్గాల్లో కాస్త అసంతృప్తి ఉంది. దీనితో బీసీలకు రాజ్యాధికారం కల్పించేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు మొదలు పెట్టింది అనే ప్రచారం కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కేంద్రమంత్రిగా బండి సంజయ్ కు ప్రాధాన్యత ఇస్తుంది బిజెపి. మరికొంతమంది బీసీ నాయకులను కూడా ప్రోత్సహించేందుకు బిజెపి నాయకత్వం సిద్ధమైంది.
Also Read : జగన్ పై పోరాటినికి సిద్ధమైన విజయమ్మ
ఇలాంటి టైం లో కల్వకుంట్ల కవిత సైలెంట్ గా బీసీ ఉద్యమాన్ని తలకెత్తుకునే ప్రయత్నం చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. భారత రాష్ట్ర సమితి నుంచి బయటికి వచ్చిన తర్వాత తన భవిష్యత్తు కార్యాచరణ బీసీ నాయకులతో కలిసి నిర్ణయిస్తానంటూ కొన్ని కామెంట్స్ చేశారు కవిత. దీనితో ఆమె బీసీల పేరుతో ఓ పార్టీ స్థాపించే అవకాశం ఉండవచ్చు అనే వ్యాఖ్యలు సైతం వినిపించాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఈ పార్టీని ప్రకటించాలని కవిత భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం మొదలైంది.
Also Read : ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ – లాభాలు మరియు నష్టాలు
రెండు తెలుగు రాష్ట్రాలకు బీసీ నాయకులను అధ్యక్షులుగా ప్రకటించి.. తాను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా, పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై రాజకీయ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. కవిత రాజకీయ నిర్ణయాలపై.. ఇప్పటికే తెలంగాణ సమాజంలో అనేక అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు వెలమ సామాజిక వర్గానికి చెందిన కవిత బీసీ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తాను అంటూ ఏదైనా పార్టీ ప్రకటించిన, లేదు బీసీ ఉద్యమానికి ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చిన సరే అది ఖచ్చితంగా హాస్యాస్పదంగా అవుతుంది. తన తండ్రికి మద్దతిస్తున్న కవిత తెలంగాణకు దళిత ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే ఎందుకు మాట్లాడలేదనే ప్రశ్నల సైతం ఉత్పన్నం ఆయ్యే అవకాశం ఉంది.